ప్రజా సంక్షేమమే లక్ష్యం : మంత్రి రాజా

ప్రజా సంక్షేమమే లక్ష్యం : మంత్రి రాజా

ప్రజాశక్తి-కోటనందూరు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. కెఇ.చిన్నపాలెంలో మాజీ లావా దేవస్థానం చైర్మన్‌ లాలం బాబ్జి ఆధ్వర్యంలో నిర్వహించిన డి.పట్టాలను పంపిణీ, కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రాజా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ పరిపాలన సంక్షేమం, అభివద్ధిలో అగ్రగామిగా నిలిచిందన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా అన్ని సామాజిక వర్గాలనూ ఆర్థికంగానూ, రాజకీయంగా అభివృద్ధి చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. విద్య, వైద్య రంగాల్లో పెను మార్పులు తీసుకువచ్చి ప్రజలకు సేవ చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ జగన్‌ ప్రభుత్వంపై అసత్యాలను ప్రచారం చేస్తున్నారని, ప్రజలు వారిని నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. నాలుగున్నరేళ్ల పాలనలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోలో 90 శాతాన్ని అమలు చేసినట్టు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి లగుడు శ్రీనివాస్‌, తుని మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ వెలగా వెంకట కృష్ణాజీ, గుడ్ల సత్తిబాబు, గొర్ల రామచంద్ర రావు, జగటాలకోట సత్తిబాబు, బండి నానిబాబు, చింతకాయల చినబాబు, పాల్గొన్నారు.

➡️