ప్రజా సంక్షేమమే సిఎం జగన్‌ లక్ష్యం

పేరూరులో వై ఎపి నీడ్స్‌ జగన్‌ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

ప్రజాశక్తి-అమలాపురం రూరల్‌

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సిఎం జగన్‌ అనేక పథకాలు అమలుచేస్తున్నారని పలువురు ప్రజాప్రతినిధులు అన్నారు. అమలాపురం మండలం పేరూరు గ్రామం సచివాలయం-1 లో గురువారం వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం సర్పంచ్‌ దాసరి అరుణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జగన్‌ ఈ రాష్ట్రానికి ఎందుకు కావాలి, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేయు సంక్షేమ పాలన గురించి పలువురు ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఎంపిపి కుడుపూడి భాగ్యలక్ష్మి బాబు, ఉప సర్పంచ్‌ కుడుపూడి సత్యనారాయణ, ఎంపిటిసి సభ్యులు, మాజీ ఎంపిటిసి సభ్యుడు దాసరి డేవిడ్‌, ఇఒపిఆర్‌డి మల్లికార్జున రావు, సచివాలయ కన్వీనర్లు, గహ సారదులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️