ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వాన సమారాధన

Dec 10,2023 16:32 #ntr district

ప్రజాశక్తి-అజిత్‌ సింగ్‌ నగర్‌ : కార్తీక మాసంలో వాన సమారాధన ఆత్మీయ కలయక పురస్కరించుకొని సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలసి ఆడుదాం.. కలసి పాడుదాం.. కలసి బొంచేద్దాం కార్యక్రమాన్ని నున్న మామిడి తోటలో ఘనంగా నిర్వహించారు. చిన్నారుల సంస్కృతిక కార్యక్రమాలు, మహిళలు కోలాటం నత్యం ఎంతో ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిహెచ్‌ బాబురావు, రమణారావు నిజం, సాంబి రెడ్డి, ఆంజనేయులు, సిపిఎం మహిళ విభాగ సభ్యులు ప్రజా సంఘాల సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️