ప్రతిభను వెలికి తీసే వేదిక ఆడుదాం ఆంధ్ర

ప్రజాశక్తి – సీతంపేట : మండలంలోని కుడ్డపల్లిలో ఆడుదాం ఆంధ్ర పోస్టర్ను కార్యదర్శి వై.పాపారావు, సర్పంచులు నరసమ్మ, ప్రతినిధి బాపయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను గుర్తించి అవగాహన కల్పించి రిజిస్ట్రేషన్‌ చేశారు. దీనిపైకార్యదర్శి పాపారావు అవగాహన కల్పించారు. ఫిబ్రవరి 3 వరకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. యువతలో దాగి ఉన్న ప్రతిభ వెలికి తీయడానికి ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ఒక వేదిక అవుతుందని, దీనిని క్రీడాకారులు వినియోగించుకోవాలని కోరారు. గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగడానికి ఇది ఒక గొప్ప అవకాశం అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ప్రతినిధి మోహన్‌రావు, గ్రామస్తులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.గొయిదిలో ఆడదాం ఆంధ్ర బ్యానర్‌ డిస్‌ప్లేమండలంలోని గొయిది సచివాలయంలో ఆడుదాం ఆంధ్రా బ్యానర్‌ డిస్ప్లే కార్యక్రమం మంగళవారం ఎంపిడిఒ కె.గీతాంజలి నిర్వహించారు. గ్రామ వాలంటీర్లు మొబైల్‌ ఫోన్లో రిజిస్టర్‌ చేసే అవకాశం ఉందన్నారు. దీన్ని వినియోగించుకోవాలని క్రీడాకారులను కోరారు. అనంతరం తురాయిపువలస సమీపాన గొయిది గెడ్డ నీరు తుపాన్‌ సందర్భంగా రోడ్డుపైకి రాకుండా జెసిబి ద్వారా ఎంపిడిఒ గీతాంజలి, తహశీల్దార్‌ నర్సింహమూర్తి, జంగ్లింగ్‌ క్లీనింగ్‌ చేశారు.

➡️