ప్రతి విద్యార్థ్థీ పోటీపడి ఉన్నత స్థాయికి ఎదగాలి

పి.గన్నవరం మండలం గంటి పెదపూడి హైస్కూల్లో క్రీడా సామగ్రి అందజేస్తున్న ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు

ప్రజాశక్తి – మామిడికుదురు(పి.గన్నవరం)

ప్రతి విద్యార్థి పోటీపడి ఉన్నత స్థాయికి ఎదగాలని పి.గన్నవరం ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు పేర్కొన్నారు. పి.గన్నవవరం మండలం గంటి పెదపూడి, ఉడిమూడి జిల్లా పరిషత్‌ హైస్కూళ్లకు జగనన్న గోరుముద్దలో మంజూరైన వంట పాత్రలను మధ్యాహ్నం భోజన నిర్వాహకులకు శనివారం అందించారు. అదేవిధంగా విద్యార్థులకు క్రీడాసామగ్రి కిట్లను అందించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం రుచి చూశారు. జి.పెదపూడి పంచాయతీ వద్ద 67 మంది రైతులకు 9 ఎకరాల 64 సెంట్లు పెరుగులంక భూములు అయిదు సంవత్సరాల పాటు లీజు భూములు పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లు దంగేటి సత్యనారాయణ, ఎన్‌.ప్రసన్నకుమార్‌, సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షులు టి.బంగారు నాయుడు, రవిరాజు, డి.దుర్గారావు, జి.పెదపూడి హైస్కూల్‌ హెచ్‌ఎం ఎన్‌.ఎలిజబెత్‌, ఉడిముడి హైస్కూల్‌ హెచ్‌ఎం ఎమ్‌.మహాలక్ష్మి, మరియు ఉపాధ్యాయులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️