ప్రధానికే లేని భద్రత సామాన్యులకు ఉంటుందా..?

Mar 19,2024 22:05
ఫొటో : మాట్లాడుతున్న కావలి అసెంబ్లీ టిడిపి అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి

ఫొటో : మాట్లాడుతున్న కావలి అసెంబ్లీ టిడిపి అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి
ప్రధానికే లేని భద్రత సామాన్యులకు ఉంటుందా..?
ప్రజాశక్తి-కావలి : ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భద్రత కల్పించలేని అధికారులు సామాన్య ప్రజలకు రక్షణ కల్పిస్తారా అని కావలి అసెంబ్లీ టిడిపి అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న చిలకలూరిపేట ప్రజాగళం సభ భద్రతా వైఫల్యంపై విచారణ చేపట్టాలని, సభ భద్రతలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులపై చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. లక్షలాది మంది జనం తోసుకొస్తుంటే నియంత్రించాల్సిన పోలీసులు చోద్యం చూడటం దేనికి సంకేతమన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బిజెపి – టిడిపి – జనసేన తొలి సభ విజయవంతమైనదన్నారు. ఎపి ప్రజల కష్టాలు తనకు తెలుసని వచ్చే ఐదేళ్లు ఎంతో కీలకమైనవి అని ప్రధానమంత్రి స్పష్టం చేశారని, ఎపి ప్రజలకు అండగా ఉంటానని తెలపడం జరిగిందన్నారు. ఐదేళ్ల జగన్‌రెడ్డి పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని, అవినీతి, దోపిడీలో అధికార వైసిపి నేతలు పోటీ పడ్డారని సభ ద్వారా ప్రధాని స్పష్టం చేశామన్నారు. ఎపి ప్రభుత్వంపై ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉందో చిలకలూరిపేట సభ ద్వారా తెలుస్తుందని, ఈ అరాచక పాలనకు అంతం పలుకుదామని ప్రధాని పిలుపుచ్చారన్నారు. జగన్‌ రెడ్డి ప్రభుత్వంతో పాటు అందులో పనిచేస్తున్న కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే సభకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించారని విమర్శించారు.

➡️