ప్రభుత్వంతో అంగన్‌వాఢీ

అంగన్వాడీల సమ్మె పతాకస్థాయికి చేరింది. అంగన్వాడీలు నిరవధిక సమ్మె విరమించాలని, లేకుంటే విధులకు గైర్హాజరైనట్లు భావించి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ బెదిరింపులు ఓవైపు… అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలుకొట్టాలని ఉన్నతాధికారుల హెచ్చరికలు మరోవైపు… దీక్షా శిబిరాల వద్దకు అధికారులు వచ్చి తాళాలివ్వాలంటూ హుంకారాలు ఇంకోవైపు… మహిళలని కూడా చూడకుండా చులకనాభావంతో ఓ ప్రజాప్రతినిధి చేసిన అనుచిత వ్యాఖ్యలు మరోవైపు.. ఎవరెన్ని చేసినా అంగన్వాడీలు ఏమాత్రమూ వెనుకడుగు వేయడం లేదు. మడమ తిప్పడం లేదు. నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని తేల్చిచెబుతున్నారు. పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. అంగన్వాడీల సమ్మెకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది.

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం జిల్లాలో అంగన్వాడీలు చేపడుతున్న నిరవధిక సమ్మె గురువారం మూడో రోజుకు చేరింది. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో విజయనగరంలోని కలెక్టరేట్‌ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు టి.వి.రమణ, జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు మాట్లాడారు. అంగన్వాడీలపై ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బేషరుతుగా ఎమ్మెల్యే అంగన్వాడీలకు క్షమాపణ చెప్పాలని, పోలీసులు సుమోటాగా ఎమ్మెల్యేపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో సెంటర్ల తాళాలు బద్దలుకొట్టి తెరిపించడాన్ని తప్పుబట్టారు. తాళాలు బద్దలు కొట్టిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం కవ్వింపు చర్యలు ఆపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీల పోరాటాన్ని బలపరుస్తున్నామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాస్‌, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి రాకోటి ఆనంద్‌ తెలిపారు. మానవహారంలో సిఐటియు జిల్లా కార్యదర్శులు ఎ.జగన్మోహనరావు, యుఎస్‌ రవికుమార్‌, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు, నాయకులు విశాలాక్షి, శివలక్ష్మి, మంగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారుచీపురుపల్లి : చీపురుపల్లి తహశీల్దార్‌ కార్యాలయం వద్ద మూడో రోజు అంగన్వాడీల సమ్మె శిబిరం కొనసాగింది. ఈ సందర్భంగా మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్షులు బలగ నాగమణి, తదితరులు పాల్గొన్నారు.బాడంగి : బాడంగిలో మూడో రోజు అంగన్వాడీల సమ్మె కొనసాగింది. అంగన్వాడీల శిబిరాన్ని టిడిపి ఎస్‌టి సెల్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పాలవలస గౌరు సందర్శించి, సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు సురేష్‌, రవణమ్మ పాల్గొన్నారు.గంట్యాడ : గంట్యాడ ఐసిడిఎస్‌ కార్యాలయం నుంచి ఎంపిడిఒ కార్యాలయం వరకు అంగన్వాడీలు ర్యాలీ చేపట్టారు. అనంతరం మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. రామభద్రపురం : అంగన్వాడీల మూడో రోజు సమ్మెలో భాగంగా ఆర్‌టిసి కాంప్లెక్సు వద్ద రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహన రాకపోకలు స్తంభించాయి. పోలీసులు అక్కడికి చేరుకుని, ట్రాఫిక్‌ను నియంత్రించారు. అంగన్వాడీల దీక్షా శిబిరాన్ని యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు విజయగౌరి, ఎపిటిఎఫ్‌ నాయకులు బి.జోగి నాయుడు, సిఐటియు మండల కార్యదర్శి బలస శ్రీనివాసరావు సందర్శించి, మద్దతు తెలిపారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి సిహెచ్‌.తిరుపతి నాయుడు, మండల కార్యదర్శులు పద్మజ, వి.రామబ్రహ్మం, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు సత్యవతి, రాధమ్మ, కుమారి పాల్గొన్నారు.భోగాపురం : భోగాపురంలో ఎంపిడిఒ కార్యాలయం నుంచి పంచాయతీ కార్యాలయం వరకు అంగన్వాడీలు భారీర్యాలీ నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి బి.సూర్యనారాయణ, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.ప్రజాశక్తి – జామి, శృంగవరపుకోట, కొత్తవలస అంగన్వాడీలు చేపడుతున్న నిరవధిక సమ్మెపై ప్రభుత్వ పెద్దలు, అధికారులు అక్కసు వెళ్లగక్కడం ప్రభుత్వ దిగజారుడు తనాన్ని తెలియజేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ధ్వజమెత్తారు. అంగన్వాడీ కార్యకర్తలు ప్రజాస్వామ్య పద్ధతిలో సమ్మె చేస్తుంటే, పాలకులు అడ్డదారుల్లో కేంద్రాలు తెరవాలని చూడట మేమిటని, ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. గురువారం శృంగవరపుకోట, జామి, కొత్తవలసలో అంగన్వాడీల సమ్మెలో భాగంగా చేపడుతున్న ఆందోళనల్లో ఆయనతోపాటు ఎపి రైతుసంఘం, ఎఐటియుసి, సిఐటియు నాయకులు పాల్గొని, సంఘీభావం తెలియజేశారు. శృంగవరపుకోట పట్టణంలో దేవి కూడలిలో ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తమ్మినేని మాట్లాడుతూ మాత, శిశు సంరక్షణ కోసం సేవలందిస్తున్న అంగన్వాడీల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొండిగా వ్యవ హరించడం దుర్మార్గమ న్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చినప్పల నాయుడు.. అంగ న్వాడీలపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని మాట్లాడాలని, అలా కాకుండా నోటికి ఏది వస్తే అది పలకడం సమంజసం కాదని, ఆ స్థాయికి తగదని హితవుపలికారు. కొత్తవలసలో దీక్షా శిబిరం వద్దకు సిడిపిఒ వచ్చి తాళాలు ఇవ్వాలని అంగన్వాడీలను కోరడంతో తమ్మినేని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, నాయకులు గాడి అప్పారావు, మద్దిల రమణ, చెలికాని ముత్యాలు, ఎపి రైతుసంఘం జిల్లా నాయకులు చల్లా జగన్‌, ఎఐటియుసి నాయకులు వి.మాణిక్యం, సుశీల, వెంకటలక్ష్మి, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు ఆర్‌.వెంకటలక్ష్మి, బి.కనకమహాలక్ష్మి, ఆర్‌.రామలక్ష్మి, ఆదిలక్ష్మి, పి.విష్ణమ్మ, ఎల్‌.శ్రీదేవి, కాకర తులసి, శంకరావతి, డి.శ్యామల, తదితరులు పాల్గొన్నారు.టిడిపి మద్దతుశృంగవరపుకోటలో సమ్మె శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, టిడిపి మండల అధ్యక్షులు జి.ఎస్‌.నాయుడు, ఐటిడిపి రాష్ట్ర కార్యదర్శి చక్కా కిరణ్‌ కుమార్‌, వార్డు మెంబెర్‌ పెదగాడ రాజు, భీశెట్టి మోహన్‌ కుమార్‌, సిపిఐ నాయకులు ఎం.రమణ సందర్శించి, మద్దతు తెలియజేశారు. ప్రజాశక్తి-బొబ్బిలిఅంగన్వాడీ కార్యకర్తలపై ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పట్టణంలోని ఎన్‌టిఆర్‌ బొమ్మ జంక్షన్‌ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీల సమ్మెకు కాంగ్రెస్‌ నేతలు మువ్వల శ్రీనివాసరావు, మడకపాటి శ్రీను, సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు, పికెఎస్‌ జిల్లా అధ్యక్షులు టి.అప్పలనాయుడు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు కామేశ్వరి, నిర్మల, ఉమాగౌరి, రోజా, తదితరులు పాల్గొన్నారు.ప్రజాశక్తి-గరివిడిమహిళలని చూడకుండా అంగన్వాడీల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసిపి నేతల తీరు దారుణమని మాజీమంత్రి అమరనాథ రెడ్డి, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కిమిడి నాగార్జున వ్యాఖ్యానించారు. వయసు, హోదా మరిచి బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకటచినప్పలనాయుడు వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్యన్నారు. వైసిపి నేతలే ఒళ్లు బలిచి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గరివిడిలో అంగన్వాడీలు నిరసన ర్యాలీ చేపట్టారు. అంగన్వాడీలకు మద్దతుగా టిడిపి, జనసేన నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో సిఎం జగన్‌ ఇచ్చిన హామీలనే అమలు చేయాలని అంగన్వాడీలు కోరుతున్నారని గుర్తుచేశారు. అంగన్‌వాడీలకు అండగా నిలిచి పోరాటాల్లో పాల్గొంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో జనసేన నాయకులు విసినిగిరి శ్రీనివాసరావు, టిడిపి నాయకులు ముల్లు రమణ, అడపా సూర్యనారాయణ, రెడ్డి లక్ష్మణరావు, మీసాల కాశీ, సిఐటియు నాయకులు అంబళ్ల గౌరినాయుడు, అంగన్వాడీ సంఘం నాయకులు రౌతు వరలక్ష్మి, రూపావతి, కృష్ణవేణి, సరళ, పాల్గొన్నారు. అంగన్వాడీలకు యుటిఎఫ్‌ నాయకులు డి.రాము, ఎ.సత్యశ్రీనివాసరావు, మీసాల రవికుమార్‌ మద్దతు పలికారు.

➡️