ప్రభుత్వం దిగొచ్చేవరకూ పోరాటం

ప్రజాశక్తి – యంత్రాంగం

ప్రభుత్వం దిగొచ్చే వరకూ పోరాటం ఆగదని అంగన్వాడీలు స్పష్టం చేశారు. ఎస్మా ప్రయోగించినా, మెమోలు జారీచేసినా వెనక్కితగ్గేది లేదని వారు పేర్కొన్నారు. అంగన్వాడీల సమ్మె శనివారానికి 26వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు పలుచోట్ల వినూత్నంగా నిరసన తెలిపారు. ఏలూరులో చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షను ఆలిండియా అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ ఫెడరేషన్‌ అఖిలభారత ప్రధాన కార్యదర్శి ఎఆర్‌.సింధు ప్రారంభించారు. ఏలూరు అర్బన్‌ : స్థానిక కలెక్టరేట్‌ వద్ద అంగన్వాడీలు 24 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. ఈ దీక్షలో అంగన్వాడీల యూనియన్‌ జిల్లా కార్యదర్శి పి.భారతి, ప్రాజెక్టు లీడర్లు స్వర్ణకుమారి, కె.సత్యవతి, త్రివేణి, నాగమణి, విమల మొత్తం 30 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌.లింగరాజు, డిఎన్‌విడి.ప్రసాద్‌, అంగన్వాడీల యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షురాలు కె.విజయలక్ష్మి, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి జె.గోపి పాల్గొన్నారు.ఎస్మా ను వ్యతిరేకిస్తూ ర్యాలీ అంగన్వాడీల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని నిరసిస్తూ అంగన్వాడీలు భగ్గుమన్నారు. దీక్షా శిబిరం నుండి వందలాది మంది ఫైర్‌ స్టేషన్‌ రకూ నిరసన ర్యాలీ చేపట్టారు. అక్కడ మానవహారంగా నిలబడి నిరసన తెలిపారు. ఈ ర్యాలీకి సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌.లింగరాజు, ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌, వి.సాయిబాబు, జె.గోపి నాయకత్వం వహించారు. జీలుగుమిల్లి : మండటంలోని అంగన్వాడీలు పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజుకు వినతిని అందించారు. పింఛన్ల పంపిణీకి విచ్చేసిన ఎంఎల్‌ఎను తిరిగి వెళ్తుండగా అంగన్వాడీలు అడ్డుకున్నారు. 26 రోజులుగా సమ్మె చేస్తుంటే కనీసం ప్రభుత్వం స్పందించడం లేదని అడ్డుకున్నారు. సమస్యలు పరిష్కరించకుండా బెదిరింపులకు దిగడం సమంజసం కాదన్నారు. అనంతరం ఆయనకు వినతిని అందించారు. దీనిపై ఎంఎల్‌ఎ మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో మాట్లాడి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కొండలరావు, అంగన్వా డీలు నాగమణి, ఎస్తేరు, సరళ, జ్యోతి, పూర్ణావతి పాల్గొన్నారు.చింతలపూడి : మండలంలోని అంగన్వాడీలు జిల్లాకేంద్రం ఏలూరులోని కలెక్టరేట్‌ వద్ద 24 గంటల దీక్షకు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీల యూనియన్‌ నాయకులు ఎన్‌.సరోజని, కార్యదర్శి టి.మాణిక్యం మాట్లాడారు. కొయ్యలగూడెం : మండలంలో అంగన్వాడీల సమ్మె కొనసాగింది. సమ్మెకు భవన నిర్మాణ కార్మికుల యూనియన్‌ నేత నారపల్లి రమణరావు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి.ప్రసాద్‌, ఎం.వీరబాబు, ఆర్‌.వెంకటేశ్వరరావు, కె.నరేంద్ర, కె.బాలాజీ, టి.రాజు, ఎం.వెంకట సూరిబాబు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శుక్ల బోయిన రాంబాబు, అంగన్వాడీల యూనియన్‌ నాయకురాలు శివరత్నకుమారి, వై.కోటేశ్వరి, కృష్ణవేణి, అడపా నాగజ్యోతి, సునీతారాయల్‌, బొబ్బిలి చిట్టి, కె.జ్యోతి, కె.మాధవి, పి.భాగ్యలక్ష్మి, వెంకటలక్ష్మి, మంగ, శ్రీదేవి, నుర్జహాన్‌ పాల్గొన్నారు.బుట్టాయగూడెం : మండలంలోని అంగన్వాడీలు 26వ రోజు సమ్మెలో భాగంగా వినూత్నంగా తమ నిరసన తెలిపారు. తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట పొర్లుదండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మాట్లాడుతూ 26 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకొచ్చిన వైసిపి ప్రభుత్వానికి తగినగుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు భూదేవి, జ్యోతి, మంగతాయారు, దుర్గలక్ష్మి, రాజకుమారి, దుర్గ, మంగమ్మ, రామలక్ష్మి, మల్లేశ్వరి, కృపామణి పాల్గొన్నారు.కలిదిండి : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 26వ రోజూ కొనసాగింది. ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీల యూనియన్‌ నాయకులు షేక్‌ అబిదాబేగం, జక్కంశెట్టి మేనక లక్ష్మి, రమాదేవి, అంగన్వాడీలు, హెల్పర్లు పాల్గొన్నారు.ముదినేపల్లి : మండలంలో అంగన్వాడీల సమ్మె 26వ రోజూ కొనసాగింది. ఈ సందర్భంగా చేపట్టిన దీక్షలో 140 మంది అంగన్వాడీలు, ఆయాలు పాల్గొన్నారు.టిడిపి మద్దతుఅంగన్వాడీలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు దావు నాగరాజు అన్నారు. మండలంలోని అల్లూరులో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. వారి సమ్మెకు పార్టీ పూర్తిమద్దతిస్తుందన్నారు.

➡️