ప్రభుత్వ కళాశాల వార్షికోత్సవం

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : మండల పరిధిలోని ఉప్పుగుండూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వార్షికోత్సవ వేడుకలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ప్రిన్సిపాల్‌ రంగనాయకులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఇంటర్‌ బోర్డు ఆఐఒ సైమన్‌ విఠల్‌ మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చునని తెలిపారు. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో కొంజేటి వెంకట సురేష్‌ బాబు, మాదాసు రాంబాబు, మున్నంగి వెంకట్రావు, కొలకలూరి విజయకుమార్‌ , అమరా సుబ్బారావు, పెంట్యాల వెంకటేశ్వర్లు, వజ్రంబాబు, ఇంటర్‌ బోర్డు ఎఒ వెంకటేశ్వరరావు, కళాశాల అధ్యాపకులు సత్యనారాయణ ,నజీర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️