ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం 68 సెంటర్లలో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షల ప్రారంభం మొదటి రోజు కావడంతో ఒక నిమిషయం ఆలస్యమైన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సెంటర్లలోని అనుమతించారు. మున్ముందు నిర్వహించే పరీక్షలకు ఉదయం 8.45 గంటలకే సెంటర్‌ లోపల ఉండాలని అధికారులు విద్యార్థులకు సూచించారు. హాల్‌ టికెట్స్‌ను క్షుణంగా పరిశీలించారు. పోలీసులు విద్యార్థులు ఎలాంటి పరికరాలు లోనికి తీసుకువెళ్లకుండా తనిఖీ చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మొదటి రోజు పరీక్ష కావడంతో పెద్దఎత్తున సెంటర్ల వద్దకు చేరుకున్నారు. మొదటి రోజు తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ లాంగ్వేజ్‌ పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి డీబార్లు నమోదు కాలేదు. జనరల్‌ అభ్యర్థులు 15,696 మంది హాజరు కావాల్సి ఉండగా 15,135 మంది హాజరయ్యారు, 561 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ పరీక్షలకు సంబంధించి 1,346 మంది హాజరు కావాల్సి ఉండగా 1,263 మంది హాజరయ్యారు, 83 మంది గైర్హాజ రయ్యారు. జనరల్‌, ఒకేషనల్‌ కలిపి 17,042 మంది హాజరు కావాల్సి ఉండగా 16,398 మంది హాజర య్యారు. 644 మంది గైర్హాజరయ్యారు. పులివెందుల రూరల్‌ : పట్టణంలో ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాం తంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, వైఎస్‌ విఆర్‌ఎం ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, నారాయణ కళాశాల, శ్రీ సాయి చైతన్య జూనియర్‌ కళాశాలల్లో పరీక్షలు నిర్వహించగా ఇందులో మొత్తం విద్యార్థులు 1097మంది కాగా అందులో 28 మంది గైర్హాజరయ్యారు. చీఫ్‌ గణేశ్‌, లీలాధర్‌రెడ్డి, రవికుమార్‌, స్వర్ణలత, డిఒలుగా జ్యోతి, సుధాకర్‌రెడ్డి, త్రివేణి, విజయలక్ష్మి వ్యవహరించారు. విద్యా ర్థులు మాస్‌ కాపింగ్‌ కొట్టకుండా సిసి కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించారు. ముద్దనూరు : స్థానిక శ్రీ వివేక వర్ధిని ఎయిడెడ్‌ జూని యర్‌ కళాశాలలో శుక్రవారం ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతంగా ప్రారం భమయ్యాయి. పరీక్షా కేంద్రంలో ముద్దనూరు, తాళ్లప్రొద్దుటూరు, కొండాపురం, ముద్దనూరు బాలుర ఉన్నత పాఠశాల కళాశాల విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం తెలుగు పరీక్షకు 140 మంది విద్యార్థులకుగాను 11 మంది గైర్హాజరైనట్లు చీఫ్‌ సూపరింటెండెంట్‌ కోటేశ్వర రావు తెలిపారు.

➡️