ప్రారంభోత్సవానికి ఇంకెంతకాలం..?

Feb 24,2024 22:05

ప్రారంభోత్సవానికి ఇంకెంతకాలం..?
ప్రజాశక్తి- గంగాధర నెల్లూరు:

మండలంలోని తూగుండ్రం గ్రామంలో ఉన్న నూతన గ్రామ సచివాలయ భవనం, ఆర్‌బికె కేంద్రాలు పూర్తయినప్పటికీ ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. పాత గ్రామపంచాయతీ భవనంలో ఇరుకుగా ఉన్నప్పటికీ దానినే సచివాలయ కార్యాలయంగా ఉపయోగించుకుంటున్నారు. అలాగే ఆర్బికే కేంద్రం పూర్తయినప్పటికీ తూగుండ్రం గల పాల డెయిరీ కేంద్రంలో ఒక చిన్న గదిలో ఆర్‌బికే కేంద్రంగా ఉపయోగించుకుంటున్నారు. నూతన గ్రామ సచివాలయ భవనం, ఆర్‌బికె కేంద్రాలు పూర్తయినప్పటికీ ఎందుకు ప్రారంభించి ఉపయోగించుకోవడం లేదంటూ పంచాయతీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అన్ని సౌకర్యాలతో నిర్మించిన కొత్త భవనాల్లో కాకుండా ఇరుకు గదుల్లోనే సచివాలయం, ఆర్‌బికెలు నిర్వహించడంపై పలు విమర్శలు చేస్తున్నారు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధలు స్పందించి లక్షలు ఖర్చు పెట్టిన నిర్మించిన నూతన భవనాలను వినియోగం తేవాలనిప్రజలు కోరుతున్నారు.

➡️