ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య

Mar 20,2024 21:31

ప్రజాశక్తి-సాలూరు రూరల్‌ : ప్రేమించిన అమ్మాయి దక్కలేదని కారణంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం మండలంలోని వెలగవలసలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సాలూరు మండలం వెలగవలస గ్రామానికి చెందిన జన్మి రమేష్‌ (21) మండలంలోని తోణాం పంచాయతీ పరిధిలోని దిగువమండంగికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని అనుకున్న తరుణంలో పెద్దలు వీరి వివాహానికి అంగీకరించలేదు. దీంతో రమేష్‌ బుధవారం ఉదయం వెలగవలస గ్రామంలో తన పొలంలో పురుగుల మందు తాగాడు. అనంతరం తన అన్నయ్యకు ఈ విషయాన్ని ఫోన్‌ ద్వారా చేరవేశాడు. కొన ఊపిరితోనున్న రమేష్‌ని వెంటనే సాలూరు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి విశాఖపట్నం కెజిహెచ్‌కు వైద్యులు రిఫర్‌ చేశారు. పరిస్థితి విషమించి కెజిహెచ్‌లో మధ్యాహ్నం మరణించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️