ఫార్మసీ విద్య ద్వారా పలు అవకాశాలు

ఫార్మసీ

ప్రజాశక్తి-రావులపాలెంఫార్మసీ విద్యని అభ్యసించడం ద్వారా అనేక ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. రావులపాలెంలోని లిధియా కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీలో మొదటి సంవత్సరం బి-ఫార్మసీ, ఫార్మా-డి 2023-24 బ్యాచ్‌ విద్యార్థులకు సోమవారం తరగతులు ప్రారంభ మయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గొల్లపల్లి సూర్యారావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థి దశలో విద్యను సక్రమంగా అభ్యసించడం ద్వారా వారి భవిష్యత్తు బంగారు బాటక మారుతుందని ఆయన విద్యార్థులకు సూచించారు. ఫార్మసీరంగంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా లభిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా హాజరైన విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఫార్మసీ విద్య గురించి, ఆ రంగంలో లభిస్తున్న ఉద్యోగ అవకాశాల గురించి ప్రత్యేకంగా వివరించారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌.మనోహర్‌ బాబు మాట్లాడుతూ ఫార్మసీ విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రెటరీ గొల్లపల్లి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️