ఫిర్యాదులకు 48 గంటల్లోగా పరిష్కారం : కలెక్టర్‌

ప్రజాశక్తి రాయచోటి ఎన్నికలకు సంబంధించి మీడియాలో వస్తున్న ఫిర్యాదులకు 48 గంటల్లోగా తగు చర్యలు తీసుకొని పరిష్కరించాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిషోర్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లతో సాధా రణ ఎన్నికలు-2024 పై సంసిద్ధత గురించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి అభిషిక్త్‌ కిషోర్‌ ఈ సమా వేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లా డుతూ ఎన్నికలకు సంబంధించిన ఫారంలను పెండింగ్లో ఉంచరాదని, వాటిపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్‌ సెంటర్లలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా వివిధ రాజకీయ పార్టీలతో సమీక్షించుకొని కౌంటింగ్‌ కేంద్రాలను ఎంపిక చేసుకోవాలన్నారు. పిఒలు, ఏపీవోలు తగినంత మంది ఉండేలా చూసు కోవాలన్నారు. మీడియాలో వస్తున్న ఫిర్యాదులపై వెంటనే తగు చర్యలు తీసుకొని పరిష్కరించాలన్నారు. అనంతరం అభిషిక్త్‌ కిషోర్‌ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు అనుసరించి అన్నమయ్య జిల్లాలో ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని కలెక్టరేట్‌ సిబ్బందిని, నోడల్‌ ఆఫీసర్లను ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించి మీడియాలో వస్తున్న ఫిర్యాదులకు 48 గంటలలో తగు చర్యలు తీసుకొని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️