ఫూలేకు ఘన నివాళి

Nov 28,2023 20:42
ఫూలే చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న దృశ్యం

ఫూలే చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న దృశ్యం
ఫూలేకు ఘన నివాళి
ప్రజాశక్తి-కందుకూరు : మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలు, స్ఫూర్తి, మార్గదర్శకాలతో రాష్ట్రం ప్రగతి పథంలో ముందడుగులు వేస్తుందని ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి పురస్కరించుకొని స్థానిక వైసిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీసీల అభ్యున్నతికై కషి చేసి ఒక గొప్ప సామాజిక సేవకునిగా, సంఘసంస్కర్తగా అనేక విప్లవాత్మకమైన మార్పులను ఆనాడే తీసుకువచ్చిన మహనీయుడు అని కొనియాడారు.కార్యక్రమంలో వైసిపి ముఖ్య నాయకులు ఉన్నారు.

➡️