బంగారు భవిష్యత్తు నాశనం

Feb 2,2024 20:34

ప్రజాశక్తి-విజయనగరం కోట : రాష్ట్రంలో యువ తకు ఉద్యోగావకాశాలు కల్పించ కుండా వారి బంగారు భవిష్య త్తును వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాశనం చేసారని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి అదితి గజపతిరాజు అన్నారు. బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నగరంలోని 41, 32 డివిజన్‌ కంటోన్మెంట్‌, అంబేద్కర్‌ కాలనీ, రెల్లివీధి, ముచ్చెరువు గట్టు, తోటపాలెం, బియ్యాలపేటలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీలను ప్రజలకు వివరించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాపాడాలంటే టిడిపి – జనసేన ప్రభుత్వం ఏర్పడాలని, అందుకు ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. చంద్రబాబు పాలనలో సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకువెళ్లారని, మహిళలకు డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేయించి వారు స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించారని గుర్తు చేశారు. ప్రస్తుత వైసిపి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, రాష్ట్ర బిసి నాయకులు వేచలపు శ్రీనివాసరావు, బియ్యాలపేట సర్పంచ్‌ అబద్దం, ఉప సర్పంచ్‌ నారంశెట్టి ఈశ్వరరావు, జనసేన నాయకులు బొబ్బాది చంద్ర, కార్యాలయ కార్యదర్శి రాజేష్‌ బాబు, గొండేల ప్రకాష్‌, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️