బకాయిలు చెల్లించాలి

Feb 26,2024 21:44

ప్రజాశక్తి – మక్కువ: ఉపాధిహామీ వేతనదారులకు బకాయి వేతనాలు చెల్లించాలని వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లి గంగునాయుడు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద వేతనదారులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలు గత ఐదు వారాలుగా పనిచేస్తున్నప్పటికీ బిల్లులు చెల్లించలేదని, కూలీలకు బిల్లులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇప్పటికే ఉపాధి పనులు సక్రమంగా జరగకపోవడం వల్ల కూలీలు వలసలు వెళ్లిపోతున్నారని, పనిచేసిన వారికి కూలిరాకపోవడంతో వలసలు వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్నారని అన్నారు. వెంటనే డ్వామా పీడీ స్పందించి బకాయి వేతనాలు వెంటనేే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అలాగే రెండు పూటలా పని రద్దు చేయాలని, ఎంఎంఎస్‌ యాప్‌ రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పిట్టల సీతారాం, గిరిజన సంఘం మండల కార్యదర్శి తాడంగి ప్రభాకర్‌, కూలీలు పాల్గొన్నారు.ఉపాధి పనులు కల్పించాలి సీతానగరం : వ్యవసాయ కార్మికులకుఉపాధి పనులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డి ఈశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం ఎపిఒ ఎ.భానుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఈశ్వరరావు మాట్లాడుతూ మండలంలో అన్ని పంచాయతీల్లోనూ ఉపాధి పనుల్లేక వేతనదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కొన్ని గ్రామాల్లో ఇంకా పనులు ప్రారంభించని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రారంభించిన పంచాయతీల్లో అందరికీ పనులు ఇవ్వడం లేదన్నారు. వెంటనే అన్ని పంచాయతీల్లో పనులు ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సిహెచ్‌ కృష్ణ, సిహెచ్‌ సూర్యనారాయణ, ఎం.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️