బద్వీడులో ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’

ప్రజాశక్తి-పెద్దారవీడు: మండలంలోని బద్వీడు గ్రామంలో టిడిపి ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, టీడీపీ ఎమ్మెల్యే, పొలిట్‌ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణలను ఒకే వేదికపై చూసిన తర్వాత వైసీపీలో ఓటమి భయం మొదలైందన్నారు. యువగళం పాదయాత్ర ముగింపు కాదని, ఇది నవశకం ప్రారంభాన్ని సూచిస్తుందని అన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లి రాజభవనం తలుపులు బద్దలుకొట్టే వరకు సాగే యుద్ధమన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా టీడీపీ, జనసేన పొత్తు చారిత్రాత్మకం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ఇది చాలా అవసరం. ఈ పొత్తు 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసుకుందన్నారు. టీడీపీ, జనసేన కలిసిన రోజే వైసీపీకి ఓటమి ఖాయమైందన్నారు. అనంతరం 20 గిరిజన కుటుంబాలు టిడిపిలో చేరినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గొట్టం శ్రీనివాసరెడ్డి, కార్యకర్తలు, టిడిపి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

➡️