బాధితులకు తక్షణ న్యాయం : ఎఎస్‌పి

Dec 18,2023 20:02

 ప్రజాశక్తి-విజయనగరం :  ఫిర్యాదుదారులకు తక్షణ న్యాయం చేయాలని అదనపు ఎస్‌పి అస్మా ఫర్హీన్‌ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి దిశ డిఎస్‌పి ఆర్‌.శ్రీనివాసరావుతో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల సమస్యలు తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడారు. ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిసిఆర్‌బి ఎస్‌ఐలు వాసుదేవ్‌, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️