బాధిత చిన్నారులకు సాయం అందజేత

ప్రజాశక్తి-కొమరోలు: ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని బేస్తవారిపేట మండలం జగ్గంభొట్ల కృష్ణాపురం గ్రామానికి చెందిన ఇటీవలే తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు దివ్య హెల్పింగ్‌ హాండ్స్‌ ఆర్గనైజేషన్‌ అండగా నిలిచింది. పిల్లలకు తమవంతు సాయంగా రూ.10 వేల విలువైన మూడు ఫ్యాన్లు, ఎలక్ట్రికల్‌ వస్తువులు, 25 కేజీల బియ్యం, దుప్పట్లు శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో దివ్య హెల్పింగ్‌ హాండ్స్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షులు లొక్కు శరత్‌బాబు, ఉపాధ్యక్షులు సీహెచ్‌ సునీల్‌, సెక్రటరీ కారుమంచి చిన్న పేరయ్య, కామూరి శివరాంరెడ్డి, సంజీవని వృద్ధాశ్రమం నిర్వాహకులు ఓ రాజశేఖర్‌, రాజగోపాల్‌, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

➡️