బాధిత రైతులను ఆదుకోవాలి

Dec 17,2023 21:59 #Tdp Leader
ఫొటో : మాట్లాడుతున్న జెడ్‌పి మాజీ చైర్మన్‌ చెంచలబాబు యాదవ్‌

ఫొటో : మాట్లాడుతున్న జెడ్‌పి మాజీ చైర్మన్‌ చెంచలబాబు యాదవ్‌
బాధిత రైతులను ఆదుకోవాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : నియోజకవర్గంలో మిచాంగ్‌ తుపాన్‌ కారణంగా పంట నష్టపోయిన బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలని టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ జెడ్‌పి మాజీ చైర్మన్‌ చెంచలబాబు యాదవ్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ వరికుంటపాడు, దుత్తలూరు, వింజమూరు, కలిగిరి, కొండాపురం, జలదంకి మండలాల్లో అరటి, ఆకు తోట, మినుము, పొగాకు, బొప్పాయి, వరి, వేరుశనగ పండించిన రైతులకు తీవ్రనష్టం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో నష్టపరిహారం చెల్లించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. ముఖ్యంగా అరటి ఆకుతోట రైతులు ఇతర రైతులు తీవ్రంగా నష్టపోయారు కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన తమలపాకు రైతులకు ఎకరాకు 40000 అరటి రైతులకు రూ.40వేల వరిపొగాకు రైతులకు ఎకరాకు 30000 ఇతర పంటల ఎకరాకు రూ.20వేలు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని టిడిపిగా డిమాండ్‌ చేస్తున్నామన్నారు. అలాగే పాత్ర బ్యాంకు రుణాలను రీషెడ్యూల్‌ చేసి వడ్డీ లేని రుణాలను మంజూరు చేసి రైతుపక్షాన వైసిపి ప్రభుత్వం నిలవాలన్నారు.

➡️