బాబుతోనే ప్రజల భవిష్యత్తుకు భరోసా : వైరిచర్ల

Mar 19,2024 21:21

ప్రజాశక్తి – కురుపాం : చంద్రబాబుతోనే ప్రజల భవిష్యత్తుకు భరోసా ఉంటుందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి వైరిచర్ల వీరేశ్‌ చంద్రదేవ్‌ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన కురుపాంలో మంగళవారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వరితో పాటు ఇంటింటికి వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ, సూపర్‌ సిక్స్‌ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వీరేశ్‌ చంద్రదేవ్‌ మాట్లాడుతూ ప్రజల భవిష్యత్తుకు భరోసా, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అంది న్యాయం జరగాలంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. కావున రానున్న ఎన్నికల్లో కురుపాం నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగరేయడానికి ప్రజలు, మహిళలు, యువత సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తెలుగు యువత అధికార ప్రతినిధి కోలా రంజిత్‌ కుమార్‌, జియ్యమ్మవలస ఎంపిపి బొంగు సురేష్‌, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి కె.మల్లేశ్వరరావు, టిడిపి, జనసేన నాయకులు వెంపటపు భారతి, పాడి సుధ, డొంకాడ రామకృష్ణ, ఎన్‌.వంశీ, టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.చినభోగిలిలో ,,, సీతానగరం : మండలంలోని చినభోగిలిలో మంగళవారం పార్వతీపురం నియోజకవర్గ టిడిపి అభ్యర్థి బోనెల విజరు చంద్ర బాబు షూరిటీ… భవిష్యత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు అమలు చేయనున్న సూపర్‌సిక్స్‌ అంశాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.పులిగుమ్మిలో…పార్వతీపురంరూరల్‌: మండలంలోని పులిగుమ్మిలో మంగళవారం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి బోనెల విజరుచంద్ర ఆధ్వర్యంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు పాల్గొని ఇంటింట ప్రచారం నిర్వహించారు. అసమర్థపాలనతో రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనుకకు తీసుకువెళ్లిన వైసిపి పాలనపై ప్రజలు విముఖంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు గొట్టాపు వెంకటనాయుడు, బోను చంద్రమౌళి, గురజాన చంద్రమౌళి, బి.లక్ష్మణరావు, బేత వెంకటరమణ, సర్పంచ్‌ బాలాకుమారి తదితరులు పాల్గొన్నారు.

➡️