బిసిల అభివద్ధి చంద్రబాబుతోనే సాధ్యం : ‘చమర్తి’

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ బిసిల అభివద్ధి చంద్రబాబు తోనే సాధ్యమని టిడిపి బిసిసగర సాధికార రాష్ట్ర కన్వీనర్‌ జంపన వీర శ్రీనివాస్‌, రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్‌రాజు పేర్కొన్నారు. రాజంపేట తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌ క్యాంప్‌ కార్యాలయంలో ఆదివారం రాజంపేట పార్లమెంట్‌ సగర సాధికార కన్వీనర్‌ తాళ్లపాక వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో బిస,ి సగర సాధికార సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని బిసి సగర కులాలు ఏదైనా అభివద్ధి చెందాయంటే అది తెలుగుదేశం పార్టీ, మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు హయాంలోనేనని చెప్పారు. ప్రస్తుత సబెం జగన్‌మోహన్‌రెడ్డి ‘నా బిసి, నా ఎస్‌సి, నా ఎస్‌టి, నా మైనార్టీ’ అంటూ మనల్ని అన్ని రంగాల్లో అణచి వేస్తున్నారని విమర్శించారు. మన బిసి కులాలన్నీ ఏకతాటిపైకి వచ్చి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. గతంలో సగర కుల అభివద్ధికి తోడ్పడిన చంద్రబాబు గెలుపులో మన సగరు కులస్తులు కూడా ప్రధాన పాత్ర పోషించాలని అన్నారు. కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్‌ సగర సాధికార సభ్యులు పి.రెడ్డి శివ, పి.నారాయణ, రాష్ట్ర సోషల్‌ మీడియా కో-ఆర్డినేటర్‌ గజ్జల గణేష్‌, రమణ, సుబ్రహ్మణ్యం, సురేష్‌, ఆనంద్‌, టి.వెంకటరమణ, పి.మారేంద్ర, వెంకటసుబ్బయ్య, టి.కేశవ పాల్గొన్నారు.

➡️