భయాన్ని పోగొట్టేందుకే పరీక్షలు : పిఒ

ప్రజాశక్తి – కడప అర్బన్‌ విద్యార్థులోపున్న భయాన్ని పోగొట్టేందుకు పోటీ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడుతాయని ఎస్‌ఎష్‌ఎ పిఒ అంబరం ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం చెకుముకి సైన్స్‌ సంబరాలు భాగంగా మండల స్థాయి పరీక్షలు గురువారం నగరంలో సిఎస్‌ఐ పాఠశాలలో నిర్వహించారు. చెకుముకి పరీక్షల బాధ్యులు వెంకటేశ్వర్లు, సమతా విభాగం నాయకులు సునీత, జన విజ్ఞాన వేదిక నగర అధ్య క్షులు శివరాం, గోవిందు, ఆర్‌ఎస్‌వైఎఫ్‌ నాయకులు సుబ్బరాయుడు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సునీల్‌, సురేష్‌, డివైఎఫ్‌ఐ నాయకులు ఓబులేసు ఆధ్వర్యంలో పోటీ పరీక్షలు నిర్వహించారు. ఇందులో టీముకు ముగ్గురు చొప్పున నగరంలో 43 టీములు వేయగా ప్రైవేటు పాఠశాలల నుంచి 13 టీములుగా, ప్రభుత్వ పాఠశాలల నుండి 160 మంది విద్యార్థులు పాఠశాల స్థాయిపోటీ పరీక్షలలో నుంచి ఎంపికైనట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. వీరందరిలో బాగా రాసినటువంటి కొన్ని టీములని ఎంపిక చేసి వారిని విజేతలుగా ప్రకటి ంచారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్‌ఎస్‌ఎ పిఒ విజేతలకు బహు మతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కోశాధికారి రాజశేఖర్‌ రాహుల్‌, జిల్లా కార్యదర్శి బాల బయన్న పాల్గొన్నారు.’చెకుముకి’లో విద్యార్థుల ప్రతిభ కలసపాడు :మండలంలోని బాలికోన్నత పాఠశాలలో గురువారం నిర్వ హించిన చెకుముకి సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌లో ప్రధమ, ద్వితీయ, తతీయ, స్థానాలను స్థానిక సెయింట్‌ ఆంటోనీ ఇంగ్లీష్‌ మీడియం ఉన్నత పాఠశాల విద్యార్థులు కైవసం చేసుకున్నారు. యశ్వవర్ధన్‌ రెడ్డి, కిరణ్‌ కుమార్‌రెడ్డి, దీక్షిత్‌ రెడ్డి తమ ప్రతిభ చాటారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు చిత్తా ప్రభావతి మాట్లాడుతూ విద్యా ర్థులకు చదువుతోపాటు వారి జ్ఞానాన్ని మెరుగుపరిచేందుకు అనేక సైన్స్‌ కాంపి టీషన్‌ పరీక్షలకు తయారు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సైన్సు ఉపాధ్యాయులు, రమణాచారి, ఎంవిఆర్‌ పాల్గొన్నారు.

➡️