భిక్షాటనతో కార్మికుల నిరసన

ప్రజాశక్తి-పొదిలి: తమ సమస్యలు పరిష్కరించాలని నిరవధికంగా చేపట్టిన సమ్మె 12వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు. వారు జోలె పట్టుకుని చిన్నబస్టాండ్‌ నుంచి పెద్ద బస్టాండ్‌ వరకు పలు వ్యాపార దుకాణాల వద్ద భిక్షాటన చేశారు. తాము సమ్మె ఎందుకు చేయవలసి వచ్చిందో ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ ప్రభుత్వం దిగి వచ్చేంతవరకు సమ్మె కొనసాగిస్తామని, ఇప్పటికైనా ప్రభుత్వం సహృదయంతో తమ వేతనాలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రకమంలో ఏపి మున్సిపల్‌ వర్కర్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ సిఐటియు పొదిలి నగర పంచాయతీ నాయకులు డి సుబ్బయ్య, కెవి నరసింహం, బి కోటేశశ్వరరావు, పి నాగేంద్రమ్మ, బి హజరత్తమ్మ, ఏ రాజయ్య పాల్గొన్నారు. దర్శి: దర్శి పట్టణంలో మున్సిపల్‌ కార్మికులు సమ్మె కొనసాగుతోంది. శుక్రవారం వినూత్నంగా పంచాయతీ కార్మికులు భిక్షాటన చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు, తాండవ రంగారావు, కే హనుమంతరావు, ప్రజా సంఘాల నాయకులు కరుణానిధి, హనుమంతరావు, జూపల్లి కోటేశ్వరావు, శ్రీనివాసరావు, జూపల్లి కోటేశ్వరరావు, ప్రేమ్‌కుమార్‌, యూనియన్‌ నాయకులు ఇర్మియా, ప్రభాకర్‌, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️