భిక్షాటన చేసి కార్మికుల నిరసన

ప్రజాశక్తి- కనిగిరి : మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిపి. కేశవరావు, ఎఐటియుసి నాయకులు బాలిరెడ్డి పేర్కొన్నారు. సమ్మెలో భాగంగా కార్మికులు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులను వెంటనే రెగ్యులర్‌ చేయాలన్నారు. అప్కాస్‌ నుంచి మిన హాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఖాదర్‌ వలి, చార్లెస్‌, మార్క్‌, గరటయ్య, దస్తగిరి, రమణమ్మ, ఈశ్వరమ్మ, దానియేలు, ఎఐటియుసి నాయకులు నాసర్‌వలి, రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. గిద్దలూరు : సమ్మెలో భాగంగా పారిశుధ్య కార్మికులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. పట్టణంలోని పలు వీధుల్లో తిరిగి భిక్షాటన చేశారు. బిక్షాటన చేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. కార్మికులకు బిక్షాటనకు సిఐటియు నాయకుడు డి. థామస్‌,వివిధ ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు చంటయ్య, రంగయ్య, రవి, ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు దర్శి : మున్సిపల్‌ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జనసేన దర్శి నియోజకవర్గ నాయకుడు గరికపాటి వెంకట్‌ తెలిపారు. సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. సమ్మెలకు మద్దతు తెలిపి వెంకట్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇర్మియా, పుల్లయ్య. బొటుకు రమేష్‌, టిడిపి నాయకులు మాడపాకుల శ్రీనివాసులు, జనంపార్టీ నాయకులు తెనాలి రవిబాబులు, ఎఐటియుసి నాయకులు హనుమంతరావు, కరుణానిధి, జూపల్లి కోటేశ్వరరావు, జీవరత్నం, రేలంగి, విజయ, మరియమ్మ, పేరమ్మ, మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు.

➡️