భూయాజమాన్య హక్కు చట్టం రద్దుకు డిమాండ్‌

మామిడికుదురులో వినతిపత్రం అందజేస్తున్న న్యాయవాదులు

ప్రజాశక్తి-మామిడికుదురు

ప్రజల స్థిరాస్తులకు భద్రత లేని భూ యాజమాన్యహక్కు చట్టం 2022రద్దు చేయాలని కోరుతూ గురువారం న్యాయవాదులు తహశీల్దార్‌ కార్యాలయం ధర్నా నిర్వహించారు. భూ యాజమాన్య చట్టం లో లోపాలు సరి చేసి తాజాగా చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. తహశీల్దార్‌ రియాజ్‌ హుసేన్‌ కు డిమాండ్ల తో కూడిన వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమం లో రాజోలు న్యాయవాదుల సంఘము అధ్యక్షులు కోట సుధాకర్‌, దేవ రాజంద్రప్రసాద్‌, గంటి రవికుమార్‌, జాలెం భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️