భూహక్కుల యాజమాన్య చట్టంతో నష్టం

భూహక్కుల యాజమాన్య చట్టం

కోడుగంటి వర్థంతి సందర్భంగా జిల్లా సదస్సు

ప్రజాశక్తి-అనకాపల్లి : భూహక్కుల యాజమాన్య చట్టంతో సొంత భూమి కలిగిన భూ,స్థల యజమానులు, రైతులందరూ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని విశాఖపట్నం కోఆపరేటివ్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ చెలికాని కృష్ణ మోహన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సిపిఐ మాజీ ఎమ్మెల్యే. కోడుగంటి గోవిందరావు పదవ వర్థంతి సందర్భంగా ‘భూ యాజమాన్య హక్కుల చట్టం- పూర్వాపరాలు- పరిణామాలు’ అనే అంశంపై జిల్లా సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ అనకాపల్లి జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకట రమణ మాట్లాడుతూ దేశంలో బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే ఈ చట్టాన్ని అమలు చేయడం లేదని, అలాంటిది మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తన కేసులకు భయపడి ఈ చట్టం అమలుకు ఉత్సాహం చూపడందుర్మార్గమన్నారు. కేంద్రం వద్ద రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టే విధానాలను వీడాలని హెచ్చరించారు.

కోడుగంటికి ఘననివాళి

అంతకుముందు కమ్యూనిస్టు నేత, మాజీ ఎమ్మెల్యే కోడుగంటి గోవిందరావు వర్థంతి సందర్భంగా ఆయనకు ఘననివాళులర్పించారు. స్థానిక సిపిఐ కార్యాలయం నుంచి నెహ్రూచోక్‌లోకి కోడుగంటి విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి, బాలేపల్లి వెంకటరమణ, చెరుకు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజాన దొరబాబు, మాకిరెడ్డి రామునాయుడు, సీనియర్‌ నాయకులు రావు జగ్గారావు, మేక సత్యనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. ర్యక్రమంలో రైతు సంఘం నాయకులు కోరుబిల్లి శంకరరావు, రెడ్డిపల్లి అప్పలరాజు, వెలుగుల అర్జునరావు వియ్యపు రాజు, వేముల కన్నబాబు కోరిబిల్లి శంకర్రావు గొర్లె దేముడు బాబు, నరాల శెట్టి సత్యనారాయణ, విత్తనాల పోతురాజు,గోవిందరావు అభిమానులు పాల్గొన్నారు.

సదస్సులో మాట్లాడుతున్న కృష్ణమోహన్‌

➡️