భూ కబ్జాలపై స్పందనలో ఫిర్యాదు

Mar 4,2024 21:18

ప్రజాశక్తి – వేపాడ: మండలంలోని వీలుపరితి గ్రామ సచివాలయం పరిధిలో గల చినదుంగాడ గ్రామానికి చెందిన కొప్పల కిత్తన్నదొర సోమవారం జగనన్నకు చెబుదాం స్పందన విభాగంలో తమ భూమి కబ్జాలపై ఫిర్యాదు చేశారు. సర్వేనెంబర్‌ 6లో సుమారు1.1/2 జిరాయితీ భూము మెట్టు తమకు ఉందని అందులో జీడి తోట, టేకు మొక్కలు వేసుకున్నానని చెప్పారు. ఈ భూములు తమకు వంశపారం పర్యంగా సంక్రమించాయని గుర్తు చేశారు. సర్వే నెంబరు. 3/1లో 0.41 సెంట్లు జిరాయితీ, మెట్టు, సర్వే నెంబరు 5/14లో 44 సెంట్లకు సంబంధించిన భూమిని విశాఖపట్నం జిల్లా కృష్ణాపురం గ్రామానికి చెందిన పురుషోత్తమ, గోపాలపట్నంకు చెందిన సత్య అప్పారావు, పెందుర్తి మండలం చిన్నముసివాడి గ్రామానికి చెందిన వెంకటరామరాజులు రౌడీలను తీసుకువచ్చి తమ పేరును ఉన్న జిరాయితీ భూములను వారి పేరున రికార్డులో మార్పు చేయించుకుని తమను మానసికంగా ఇబ్బందులు పెడుతూ, తప్పుడు కేసులు నమోదు చేయించి కోర్టులు చుట్టూ తిప్పుతు న్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. క్షేత్రస్థాయిలో పరిశీలించి వంశపారంపర్యంగా తమకు ఉన్న భూములను రికార్డు పరంగా తమకే దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ తహశీల్దార్‌ బి.సత్యంకు వినతి పత్రాన్ని అందించారు. స్పందించిన తహశీల్ధార్‌ మాట్లాడుతూ ఆర్‌ఐ రామలక్ష్మిని పంపించి పరిశీలన చేయిస్తామన్నారు. జిల్లా కలెక్టర్‌ స్పందన విభాగంలో ఫిర్యాదుమండలంలోని బొద్దాం గ్రామానికి చెందిన ఎస్‌సి కులస్తులు మూనూరు రమణ, జామి చందర్రావులు తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో ఫిర్యాదు చేశారు. పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు దృష్టికి, మండల రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ తమకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదని చెప్పారు. ఎటువంటి అర్హత లేకపోయినప్పటికీ 16 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని తమకు ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంగన్వాడి కార్యకర్తపై స్పందనలో ఫిర్యాదురేగిడి: మండలంలోని గుల్లపాడు పంచాయతీ పరిధి వండాన పేట గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త ముగడ జయలక్ష్మి చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారం ఇవ్వడ ంలో జాప్యం చేస్తున్నారని ముంజేటి కోమలి, చల్ల చైతన్య ఎంపి డిఒ శ్యామల కుమారికి సోమవారం స్పందనలో ఫిర్యాదు చేశారు. అంగన్వాడి కేంద్రంలో పౌష్టికాహారం ఇవ్వకుండా సొంతానికి వాడుకొని, మిగిలిన సరుకులు అమ్ముకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంగన్వాడీలో నమోదైన రికార్డులు ప్రాప్తికి విచారణ చేపడితే అసలు విషయం బయటపడు తుందని ఎంపిడిఒకు కోరారు. ఎంపిడిఒ స్పందించి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

➡️