భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలి

ప్రజాశక్తి-రాయచోటి భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయడమే కాక కేసుల సత్వర పరిష్కా రానికి ప్రతి మండలానికి ఒక కోర్టును ఏర్పాటు చేసి న్యాయ వ్యవస్థను పటిష్టం చేయాలని భారత న్యాయవాదుల సంఘం కడప, అన్నమయ్య జిల్లాల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో న్యాయవాదులు ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా భారత న్యాయవాదుల సంఘం కడప, అన్నమయ్య జిల్లాల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఈశ్వర్‌, పౌర హక్కుల సంఘం న్యాయవాది రెడ్డయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన న్యాయవ్యవస్థ ద్వారానే ప్రజల ఆస్తులకు హక్కులను నిర్ధారించే అవకాశం ఉన్న ప్పుడే వారికి న్యాయం జరుగుతుందని అలా కాకుండా ఎలాంటి న్యాయ పరిజ్ఞా నం లేని రెవెన్యూ అధికారులు ప్రజల ఆస్తులకు హక్కుల నిర్ధారించే చట్టాన్ని అమలు చేస్తే చిన్న సన్నకారు రైతులు ఆస్తులను కోల్పోయే ప్రమాదం ఉందని భూకబ్జాదారులదే రాజ్యం అయిపోతుందని వారన్నారు. సుప్రీంకోర్టు చెప్పినట్లు ప్రతి మండలానికి ఒక కోర్టును ఏర్పాటు చేసి ప్రజలకు త్వరితగతిన న్యాయం అందుబాటులోకి వచ్చే విధంగా ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం ఉందని అలా కాకుండా న్యాయ వ్యవస్థను అవమానపరిచే విధంగా రెవెన్యూ అధికా రులకు సర్వాధికారాలు వచ్చే విధంగా భూ హక్కుల చట్టాన్ని రూపుదిద్దడం సరైనది కాదని వారన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ జాతీయ నాయకులు రామాంజనేయులు, భారతీయ అంబేద్కర్‌ సేన పల్లం తాతయ్య, ఐ ఏ ఎల్‌ జాయింట్‌ సెక్రెటరీ ఖాదర్‌ బాషా, జిల్లా న్యాయవాదుల సంక్షేమ సమితి అధ్యక్షులు రాజకుమార్‌ రాజు, ప్రధాన కార్యదర్శి ఆనంద్‌ కుమార్‌ పాల్గొన్నారు.

➡️