భోజన కార్మికులపై బెదిరింపులు ఆపాలి

Dec 20,2023 21:28
వినతిపత్రం సమర్పిస్తున్న దృశ్యం

వినతిపత్రం సమర్పిస్తున్న దృశ్యం
భోజన కార్మికులపై బెదిరింపులు ఆపాలి
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు:మధ్యాహ్న భోజన కార్మికులపై సచివాలయం ఉద్యోగుల బెదిరింపులు ఆపాలని అధ్యక్ష, కార్యదర్శులు తమ్మిరెడ్డి రేవతమ్మ, పి. శీనమ్మలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి రాష్ట్రవ్యాప్తంగా తెలిసిందే. ఈ మేరకు బుధవారం మండలంలో మాచర్ల వారిపాలెం గ్రామంలో భోజన కార్మికులపై పాల్పడుతున్న సచివాలయం ఉద్యోగులకు వ్యతిరేకంగా ఆందోళన జరిగింది. ఈ సందర్బంగా రేవతమ్మ, శీనమ్మలు మాట్లాడుతూ అంగన్వాడీ పిల్లలకి భోజనం పెట్టాలన్నారు. లేకపోతే ఉద్యోగంలో నుంచి తొలగిస్తామంటూ నీ స్థానంలో ఇంకొకరికి నీ ఉద్యోగం ఇప్పిస్తామని సచివాలయ సిబ్బంది బెదిరింపులకు పాల్పడటం దుర్మార్గమన్నారు. భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంపిడిఒ ప్రత్యూష రెడ్డి, డిటి శివయ్య, ఎంఇఒ వేణుగోపాల్‌ రెడ్డిలకు వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల సిఐటియు గౌరవాధ్యక్షులు వేగూరు వెంకయ్య, సిఐటియు నాయకులు ఈపూరు లక్ష్మయ్య, మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

➡️