మంత్రి వేణు ఇంటిని ముట్టడించిన అంగన్‌వాడీలు

Dec 27,2023 14:36
అంగన్‌వాడీలు

ప్రజాశక్తి – రామచంద్రపురం
తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలంటూ అంగన్వాడీ వర్కర్లు బుధవారం బిసి సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకష్ణ ఇంటిని బుధవారం ముట్టడించారు. తొలుత మున్సిపల్‌ కార్యాలయం నుంచి మంత్రి ఇంటి వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మంత్రి వేణు ఇంటిని చుట్టుముట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని, సమస్యలను పరిష్కరించాలని, జీతాలు పెంచాలని ప్రభుత్వం స్పందించాలని నినాదాలు చేశారు. అదేవిధంగా కంచాలను మోగిస్తూ నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు నిరసన వెన్న మంత్రి ఇంటి నుండి బయటకు వచ్చి అంగన్‌వాడీలతో మాట్లాడారు. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా..,.అంగన్‌వాడీల సమస్యలను ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని బిసి సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ హామీ ఇచ్చారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే చర్చలు జరిపారన్నారు. తమ ప్రభుత్వం పేదలకు ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. మహిళలకు డ్వాక్రా అమ్మ ఒడి, ఆసరా పథకాలు అందిస్తుంది అనే వివరిస్తుండగా మంత్రి ప్రసంగానికి అంగన్‌వాడీ వర్కర్లు అడ్డు తగి లారు. తమకు ఎలాంటి పథకాలు అమలు చేయట్లేద తెలిపారు. దీనితో మంత్రి స్పందించారు. రేపే ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలను తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రికి అంగన్‌వాడీలు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నూకల బలరాం, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు ఎం.దుర్గావరలక్ష్మి తదితరులు పాల్గన్నారు.

➡️