మతసామరస్యానికి ప్రతీక కడప

ప్రజాశక్తి – కడప మత సామరస్యానికి ప్రతీక కడప నగరమని ఉప ముఖ్యమంత్రి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌ .బి అంజాద్‌బాషా, మేయర్‌ సురేష్‌బాబు, ఎమ్మెల్సీ ఎం. రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కడప నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ శ్మశాన వాటికలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కడప పెద్ద దర్గా, దేవుని కడప, మరియాపురం చర్చిలు కడప నగరానికి మాన్యుమెంట్స్‌ లాంటివని అన్నారు. ఇలాంటి మతసామరస్యం ఎక్కడా లేదని అన్నారు. మూడు శ్మశానవాటికలు ఒకే చోట ఉండడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. రూ. 6 కోట్లతో మోడల్‌ శ్మశాన వాటికను నిర్మించామని చెప్పారు. గతంలో కీ.శే. ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి స్థలాన్ని కేటాయించారని చెప్పారు. ఈ స్థలం చాలా గుంతలు గుంతలుగా ఉండేదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ఖర్చు చేసి శ్మశాన వాటికను ఒక మోడల్‌గా తీర్చిదిద్దామని చెప్పారు. హిందువల కోసం ఎక్కడలేని విధంగా క్రిమిటోరియ ను ఏర్పాటు చేశామని చెప్పారు. నగర మేయర్‌ మాట్లాడుతూ ఇంత అభివద్ధి ఏ ప్రభుత్వంలో చూడలేదని చెప్పారు. కడప నగరం మతసామరస్యానికి ప్రతీకగా హిందూ ముస్లిం క్రైస్తవ మోడల్‌ శ్మవాన వాటికలని అన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో ఎంతో అభివద్ధి జరిగిందని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని అన్నారు. తొలుత అతిథులుహిందూ ముస్లిం క్రైస్తవ మోడల్‌ శ్మశాన వాటికల శిలాఫలకాలను ఆవిష్కరించి, ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో హిందూ ముస్లిం క్రైస్తవ మత పెద్దలు, మున్సిపల్‌ అధికారులు సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

➡️