మనుస్మృతి ప్రతుల దహనం

Dec 25,2023 23:01 #మనుస్మృతి
మనుస్మృతి ప్రతుల దహనం

ప్రజాశక్తి – తాళ్లరేవు, ముమ్మిడివరంమనుస్మృతి ప్రతులను స్థానిక తహ శీల్దార్‌ కార్యలయం వద్ద కెవిపిఎస్‌, విజ్వజన కళా మండలి ఆధ్వర్యంలో దహ నం చేశారు. మనిషిని మనిషిగా చూడని మను ధర్మ శాస్త్రం మాకొద్దంటూ 1927 డిసెంబర్‌ 25న డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ చేపట్టిన మనుస్మృతి ప్రతుల దహనంను గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్‌ నాయకులు విప్పర్తి శ్రీనివాస్‌, విశ్వజన కళా మండలి జిల్లా అధ్యక్షులు వడ్డి.ఏడుకొండలు మాట్లాడుతూ 1927 డిసెంబరు 25న అంబేద్కర్‌ దహనం చేశారని, ఆ రోజును మానవ హక్కుల దినోత్సవంగా జరుపుతున్నట్లు తెలిపారు. అఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు కె.ఈశ్వరి భాయి, టేకుమూడి ఈశ్వరరావు, పులపకూర కృష్ణ, రాంబాబు పాల్గొన్నారు. కుల వ్యవస్థకు కారణమైన మనుస్మతిని దగ్ధం చేసి, మానవ హక్కులను పరిరక్షించుకోవాలని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా సీనియర్‌ నాయకుడు, సీనియర్‌ అడ్వకేట్‌ దొనిపాటి అంజనేయులు అన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని స్థానిక బుద్ధ పార్కు అవరణలో పలు అంబేడ్కర్‌ సంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యాన సోమవారం మనుస్మతి దహన దినాన్ని మానవ హక్కుల దినంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బుద్ధ పార్కు అవరణ నుండి జాతీయ రహదారి పైకి ర్యాలీగా వచ్చి ఎన్‌ హెచ్‌ 216 పై మనువు దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కుల, వర్ణ వ్యవస్తను పెంచి పోషించే మనుస్మతి రాజ్యాంగ నిర్మాత డా బి ఆర్‌ అంబేడ్కర్‌ 1927 డిసెంబర్‌ 25 న దహనం చేసి మానవ హక్కుల పరిరక్షణ కుడిగా నిలిచారన్నారు. నాటి స్ఫూర్తితో మానవ మనుగడకు అడ్డుగా నిలిచిన మనుస్మతి నీ దహనం చేద్దాం…మానవ హక్కులను కాపాడుద్ధాం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో శరత్‌, పంతగడి నరసింహ మూర్తి, దేవరపల్లి ఏడుకొండలు, కాశి సింహాద్రివర్య, కాశి మూర్తి, ఊర్మిళ చక్రవర్తి, ఇసుకపట్ల శివ, రేవు త్రిమూర్తులు, కవి రవి నాయకులు పాల్గొన్నారు.

➡️