‘మన ఓటు -మన భవిష్యత్తు’ పోస్టర్‌ ఆవిష్కరణ

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి-కూనవరం

మన ఓటు -మన భవిష్యత్తు, ఓట్‌ ఫర్‌ ఓపిఎస్‌ నినాదాలతో యుటిఎఫ్‌ ముద్రించిన వాల్‌ పోస్టర్లను మండల విద్య వనరులు కేంద్రంలో ఆ సంఘం నాయకులు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ మండల అధ్యక్షులు ఎ.నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పి.కన్నారావు మాట్లాడుతూ మన భవిష్యత్తును నిర్ణయించేది మనం ఎన్నుకున్న రాజకీయ నేతలే కానీ, వారి రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేది మన ఓటు మాత్రమేనని పేర్కొన్నారు. అందువల్ల పాత పెన్షన్‌ స్కీమ్‌ను పునరుద్ధరణ కోసం మ్యానిఫెస్టోలో పెట్టే వారికే మన ఓటు అనే నినాదాన్ని ఉద్యోగ ఉపాధ్యాయులో తీసుకుని వెళ్ళవలసి అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు యం.రాంబాబు, టి.వెంకటయ్య, కె.రజినీకుమార్‌, యం.నందిని, నీరు కుమారి, జి.నాగదుర్గ పాల్గొన్నారు.

➡️