మరొక అవకాశం ఇవ్వండి :  ఎమ్మెల్యే కడుబండి

Feb 11,2024 21:16

 ప్రజాశక్తి-వేపాడ : ప్రజా సంక్షేమానికి అహర్నిశలు శ్రమించిన తమకు మరో అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ప్రజలను కోరారు. మండలంలోని బానాది గ్రామంలో ఆదివారం ఆయన పర్యటించారు. గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఐదేళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ తనకు మరొక అవకాశం ఇవ్వాలని కోరారు. ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ పథకాలు అందాలన్నా జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి డి.సత్యవంతుడు, డిసిసిబి చైర్మన్‌ వేచలపు వెంకట చినరామునాయుడు, ఎఎంసి చైర్‌పర్సన్‌ ఎం.కస్తూరి, సర్పంచులు కర్రీ యశోద, ఎన్‌.వెంకటరావు, వైసిపి మండల అధ్యక్షులు ఎం.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

➡️