మర్లగూడెం పేదల భూ సమస్యను పరిష్కరిస్తాం – ఐటిడిఎ పిఒ సూర్యతేజ

ప్రజాశక్తి కథనానికి స్పందన

ఫలించిన గిరిజనుల పది రోజుల దీక్షలు

          బుట్టాయగూడెం:మర్లగూడెంలోని భూసమస్యను పరిష్కరించాలని కోరుతూ గిరిజనులు పది రోజులుగా చేస్తున్న దీక్షలకు అధికారులు చర్యలు చేపట్టారు. దీనిపై ప్రజాశక్తిలో ప్రచురితమైన కథనానికి ఐటిడిఎ పిఒ సూర్యతేజ స్పందించి సిపిఎం నాయకత్వంతో సమస్యలపై చర్చించి తన పరిధిలో ఉన్న విషయాలపై వెంటనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో మర్లగూడెం గిరిజన రైతులు నిరాహార దీక్షలను విరమించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ మర్లగూడెంలోని 1/70 చట్టం భూములను గత 30 సంవత్సరాల నుంచి స్థానిక గిరిజనులు సాగు చేస్తున్నారని, కోర్టు విషయం గురించి పిఒ మాట్లాడటం జరిగింది. ఎల్‌టి ఆర్‌ భూముల్లోని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం విషయంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భూమిని చదును చేసి పంట భూమిగా మారుస్తామని తెలిపారు. ఐటిడిఎ పిఒ కోర్టులో ఉన్న కేసులను సత్వరం పరిష్కారం చేసే విధంగా చర్యలు చేపడుతావ్‌ అని కూడా హామీ ఇవ్వడం జరిగిందిఅన్నారు. అనంతరం దీక్ష శిబిరంలో కూర్చున్న గిరిజనులకు నిమ్మరసం అందించి దీక్షను విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ, పోలోజు నాగేశ్వరావు, పి.దుర్గారావు, మడకం వెంకటేశ్వర శ్రీదేవి, రోజా ఉన్నారు.

➡️