మస్తానయ్యకు జాతీయ అవార్డు

Dec 11,2023 23:26 #మస్తానయ్య

ప్రజాశక్తి-మార్కాపురం : టిఎన్‌టియుసి రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డి.మస్తానయ్య జాతీయ సేవా పురస్కార్‌ అవార్డు ఎంపికయ్యారు. మస్తానయ్య సేవా కార్యక్రమాలను గుర్తించిన శ్రీదాసరి నారాయణరావు కల్చరల్‌ అకాడమి 25వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా డాక్టర్‌ నందమూరి తారక రామావు జాతీయ సేవా పురస్కార్‌ అవార్డును అందజేసింది. విశాఖలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధులు మనస్తాయ్యకు అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా మస్తానయ్య టిడిపి నాయకులు, మంత్రిమండలి సభ్యులు ఆదివారం సత్కరించారు.

➡️