మహిళలకు సర్టిఫికెట్స్‌ అందజేత

Jan 21,2024 21:41
ఫొటో : సర్టిఫికెట్స్‌ అందుకున్న శిక్షణ మహిళలు

ఫొటో : సర్టిఫికెట్స్‌ అందుకున్న శిక్షణ మహిళలు
మహిళలకు సర్టిఫికెట్స్‌ అందజేత
ప్రజాశక్తి-కావలి : సంయుక్త సేవాసంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ఆధ్వర్యంలో కావలి పట్టణం ప్రముఖ వ్యాపారవేత్త, రోటరీ క్లబ్‌ సభ్యులు బచ్చు వీరాస్వామిపూర్తి సహకారంతో సంయుక్త సేవాసంస్థ కార్యాలయంలో నాలుగు నెలలపాటు ఉచితంగా మగ్గం, టైలరింగ్‌ శిక్షణ నేర్చుకున్న మహిళలకు ఆదివారం రోటరీ క్లబ్‌లో సర్టిఫికెట్స్‌ అందజేశారు. కార్యక్రమంలో దాత ప్రముఖ వ్యాపారవేత్త, రోటరీ క్లబ్‌ సభ్యులు బచ్చు వీరాస్వామి, రోటరీ క్లబ్‌ సభ్యులు సంయుక్త సేవాసంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర, సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్‌ బెజవాడ రవికుమార్‌, ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు ఎమ్‌.జయచంద్ర నాయుడు, సంయుక్త సేవాసంస్థ మాజీ అధ్యక్షుడు బుర్లా.రఘు కుమార్‌ రెడ్డి, సంయుక్త సేవాసంస్థ సభ్యులు నేలటూరి శివప్రసాద్‌ రెడ్డి, ఎమ్‌.అజిత్‌ బాబు, ఎమ్‌విఎన్‌ ప్రసాదరావు, నైస్‌ కంప్యూటర్‌ వెంకటరెడ్డి పాల్గొని కుట్టు శిక్షణ, మగ్గం వర్క్‌ నేర్చుకున్న మహిళలకు సర్టిఫికెట్స్‌ అందజేశారు. ఈ సందర్భంగా దాత బచ్చు వీరాస్వామి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సంయుక్త సేవాసంస్థ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. శిక్షణ పొందిన మహిళలు జీవనోపాధిని పెంపొందించు కోవడానికి కృషి చేయాలని కోరారు. సంయుక్త సేవాసంస్థ ద్వారా మహిళలకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన సహాయాన్ని అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే శిక్షణ పొందిన మహిళల్లో దివ్వాంగురాలైన సృజనకు కుట్టు మిషను కూడా అందజేస్తానని తెలిపారు. ప్రముఖ వ్యాపారవేత్త మాజీ రోటరీ అధ్యక్షుడు ఎమ్‌.జయచంద్ర నాయుడు మాట్లాడుతూ సంయుక్త సేవాసంస్థ ద్వారా 60మంది మహిళలకు ఉచితంగా మగ్గం, టైలరింగ్‌ శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన సహాయాన్ని అందజేసిన బచ్చు వీరాస్వామిని అభినందించారు. అలాగే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి సంయుక్త సేవాసంస్థ ద్వారా ఉచిత కంప్యూటర్‌ శిక్షణా తరగతులకు అవసరమైన ఖర్చు మొత్తాన్ని తానే భరిస్తానని తెలియజేశారు. సంయుక్త సేవాసంస్థను స్థాపించి దాతల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆటో డ్రైవర్‌ సురేంద్రను ప్రత్యేకంగా అభినందించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర మాట్లాడుతూ సంయుక్త సేవాసంస్థపై, తనపై ఉన్న నమ్మకంతో ఈ మగ్గం, టైలరింగ్‌ శిక్షణా తరగతులకు అవసరమైన నిధులను ఏర్పాటు చేసిన ప్రముఖ వ్యాపారవేత్త బచ్చు వీరాస్వామికి, అలాగే కంప్యూటర్‌ శిక్షణకు అవసరమైన నిధులను ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ప్రముఖ వ్యాపారవేత్త యమ్‌. జయచంద్ర నాయుడుకి హదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మగ్గం, టైలరింగ్‌ శిక్షణ నేర్పించిన గురువులు ఆయేషా, జుబేద ఉచితంగా శిక్షణ పొందిన మహిళలు పాల్గొన్నారు.

➡️