మహిళలదే పైచేయి

Jan 22,2024 21:20

– 13 అసెంబ్లీల్లోనూ ప్రథమ స్థానం- కడపలో జిల్లాలో 8,25,177, అన్నమయ్యలో 7,13,326 మంది మహిళా ఓటర్లుప్రజాశక్తి – కడప ప్రతినిధి కడప, అన్నమయ్య జిల్లా ఓటర్ల జాబితా విడు దలైంది. ఆయా జిల్లాల రెవెన్యూ అధికార యంత్రాంగాలు కడప జిల్లాలోని ఏడు, అన్నమయ్య జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సుదీర్ఘ పరిశీలన, వడపోతల అనంతరం సోమవారం ఓటర్ల జాబితాను విడుదల చేసింది. కడప జిల్లాలో 16,16,509 మంది, అన్నమయ్య జిల్లాలో 14,02,808 మంది ఓటర్లు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. కడప జిల్లాలో 8,25,177 మంది, అన్నమయ్య జిల్లాలో 7,13,326 మంది మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నట్లు తేలింది. కడప జిల్లాలోని కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేల్‌ అసెంబ్లీ నియోజక వర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉండడం గమనార్హం. కడప జిల్లాలో కడప అసెంబ్లీ పరిధిలో 2,74,226 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 13,3,890 మంది పురుషులు, 14,0248 మంది స్త్రీలు, 88 మంది ట్రాన్స్‌జెండర్స్‌ 77 మంది పురుషులు, తొమ్మిది మంది పురుష, స్త్రీ సర్వీసు ఓటర్లు ఉన్నారు. బద్వేల్‌ రిజర్వ్‌డ్‌ నియో జకవర్గంలో 2,17,769 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,08, 673 మంది పురుషులు, 1,09,089 మంది స్త్రీలు, ఏడు గురు ట్రాన్స్‌జెండర్స్‌, 945 మంది, 26 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. పులివెందు అసెంబ్లీ పరిధిలోని 2,27,453 మంది ఓటర్లలో 1,10,829 మంది పురుషులు, స్త్రీలు 1,16,605 మంది, 19 మంది ట్రాన్స్‌జెండర్స్‌, 398 మంది పురుష సర్వీస్‌, ఐదుగురు స్త్రీ సర్వీసు ఓటర్లు ఉన్నారు. కమ లాపురం అసెంబ్లీ పరిధిలోని 2,00, 222 మంది ఓటర్లలో 98,037 మంది పురుషులు, స్త్రీలు 1,02, 151 మంది స్త్రీలు, 34 మంది ట్రాన్స్‌జెండర్స్‌ ఉన్నారు. జమ్మల మడుగు అసెంబ్లీ పరిధిలోని 2,40, 835 మంది ఓటర్లలో 1,17,067 మంది పురుషులు, స్త్రీలు 1,23,751 మంది, ట్రాన్స్‌జెండర్స్‌ 17 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్లు పురుషులు 262 మంది, స్త్రీలు ఆరుగురు ఉన్నారు. ప్రొద్దు టూరు అసెంబ్లీ పరిధిలో 2,46,726 మంది ఓటర్లలో పురుషులు 1,19,680 మంది,1,26,995 మంది స్త్రీలు, ట్రాన్స్‌జెండర్స్‌ 141 మంది ఉన్నారు. మైదుకూరు అసెంబ్లీ పరిధిలోని 1,02,932 మంది, స్త్రీలు 1,06,338 మంది, ట్రాన్స్‌జెండర్స్‌ ఎనిమిది మంది, సర్వీసు ఓటర్లు 267 మంది, స్త్రీలు 10 మంది చొప్పున నమోదు చేసుకోవడం గమనార్హం. అన్నమయ్య జిల్లాలో రాజంపేట అసెంబ్లీ పరిధిలో 2,37,028 మంది ఓటర్లలో 1,15,594 మంది పురుషులు, 1,21,424 మంది స్త్రీలు, 10 మంది ట్రాన్స్‌జెండర్స్‌, సర్వీసు ఓటర్లలో పురుషులు 158 మంది, స్త్రీలు 05 మంది ఉన్నారు. రైల్వేకోడూరు రిజర్వ్డ్‌ నియోజకవర్గంలో 2,01,544 మంది ఓటర్లలో పురుషులు 99,351 మంది, స్త్రీలు 1,02,176 మంది, 17 మంది ట్రాన్స్‌జెండర్స్‌ ఉండగా, సర్వీసు ఓటర్లలో 112 మంది పురు షులు, 04 ఉన్నారు. రాయచోటి అసెంబ్లీ పరిధిలో 2,50,374 మంది ఓటర్లలో 1,23,836 మంది పురుషులు, 1,26,512 మంది స్త్రీలు, 26 మంది ట్రాన్స్‌జెండర్స్‌, సర్వీసు ఓటర్లలో పురుషులు 253 మంది, స్త్రీలు 01 ఉన్నారు. తంబళ్లపల్లి అసెంబ్లీ పరిధిలోని 2,21,647 మంది ఓటర్లలో పురు షులు 1,09, 219 మంది, స్త్రీలు 1,12,418 మంది, 10 మంది ట్రాన్స్‌జెండర్లు, సర్వీసు ఓటర్లలో పురుషులు 175, స్త్రీలు 01 ఉన్నారు. పీలేరు అసెంబ్లీ పరిధిలో 2,32,435 మంది ఓటర్లలో పురుషులు 1,14,022 మంది, స్త్రీలు 1,32,399 మంది, ట్రాన్స్‌జెండర్లు 16 మంది, సర్వీసు ఓటర్లలో పురుషులు 396 మంది, స్త్రీలు 06 మంది ఉన్నారు. మదనపల్లి అసెంబ్లీ పరిధిలో 2,59,780 మంది ఓటర్లలో పురుషులు 1,27,324 మంది, స్త్రీలు 1,32,399 మంది, ట్రాన్స్‌జెండర్లు 57 మంది ఉన్నారు. ఇందులో సర్వీసు ఓటర్లు పురు షులు 168, స్త్రీలు 07 మంది ఉన్నారు. ఏదేమైనా కడప, అన్నమయ్య జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉండడం గమనార్హం.

➡️