మహిళల అభ్యున్నతే ప్రభుత్వ థ్యేయం

ప్రజాశక్తి-దొనకొండ : మహిళల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ థ్యేయమని జడ్‌పి చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. దొనకొండ సచివాలయం వద్ద డ్వాక్రా మహిళలకు నాల్గో విడత అసరా చెక్కులు గురువారం పంపిణీ చేశారు. అనంతరం ఎంపిడిఒ వసంతరావునాయక్‌ అధ్యక్షతన సభ నిర్వహించారు. సభలో బూచేపల్లి వెంకామయ్మ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా అక్కాచెల్లెళ్ల కష్టాలు తెలుసుకున్న సిఎం జగన్‌ అండగా ఉంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అధికారంలో వచ్చిన తర్వాత హామీ మేరకు డ్వాక్రా మహిళలకు నాలుగు విడతలుగా ఆసరా చెక్కులు అందజేసినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తన కుమారుడు శివప్రసాద్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మహిళలకు అనేక పథకాలు అందించిన ఏకైక సిఎం జగనే మోహన్‌రెడ్డేనని తెలిపారు. 20 ఏళ్లుగా దర్శి నియోజక వర్గ ప్రజలకు తాము అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా తనకు మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం 623 గ్రూపులకు అసరా పథకం చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీ వసుందర,ఎంపిపి ఉషారాణి, నాయకులు కాకర్ల కృష్ణారెడ్డి, కర్నాటి ఆంజనేయరెడ్డి, ఎంపిఎం వెంకటేశ్వరరావు, తొలుత బ్రహ్మేంద్రస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు.

➡️