మహిళల స్వయం ఉపాధికి చేయూత

Dec 7,2023 22:08
ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌

‘ఉన్నతి మహిళా శక్తి’ ద్వారా మహిళలకు స్వయం ఉపాధికి చేయూతను ఇస్తున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత అన్నారు. గురువారం కలెక్టర్‌ కార్యాల యంలో వద్ద వైఎస్‌ఆర్‌ క్రాంతిపథం – ఉన్నతి మహిళా శక్తి కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఆరుగురు మహిళా లబ్దిదారులకు రూ.18.84 లక్షల తో ఆటో రిక్షాలను కలెక్టర్‌ అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందితే ఆ కుటుంబం బలపడుతుందనే లక్ష్యంతో ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఎస్‌సి, ఎస్‌టి సామాజికవర్గాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలకు స్థిరమైన ఆదాయం కల్పించేందుకు ఉన్నతి కార్యకలాపాల కింద వడ్డీ రహిత రుణం ద్వారా ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఆరుగురు స్వయం సహాయక సంఘాల మహిళలకి ఉన్నతి మహిళాశక్తి కార్యక్రమంలో రూ.18,84,116 వ్యయంతో కొనుగోలు చేసిన 6 ఆటోలను లబ్ధిదారులకు అందజేశా మన్నారు. ఇందులో లబ్ధిదారుల వాటా గా కేవలం 10 శాతం చెల్లించాల్సి ఉందన్నారు. కాగా మిగిలిన 90 శాతం రుణం ఉన్నతి కార్యక్రమం ద్వారా మొత్తం – రూ.17,32,000 బ్యాంకు రుణ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఎపి గ్రీనింగ్‌ అండ్‌ సుందరికరణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ చందన నాగేశ్వర్‌ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా జిల్లాలో అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ పిడి పి.వీణాదేవి, డిపిఒ జెవి.సత్యనారాయణ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు పి. సువర్ణ, ఎమ్‌.భాను ప్రకాష్‌, లబ్దిదారులు పాల్గొన్నారు.

➡️