మహిళా జర్నలిస్టుకు సన్మానం

Mar 8,2024 21:54
ఫొటో : మహిళా జర్నలిస్ట్‌ ప్రభావతిని సన్మానిస్తున్న వైసిపి నాయకులు

ఫొటో : మహిళా జర్నలిస్ట్‌ ప్రభావతిని సన్మానిస్తున్న వైసిపి నాయకులు
మహిళా జర్నలిస్టుకు సన్మానం
ప్రజాశక్తి-బిట్రగుంట : అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా బోగోలు మండలంలోని వైసిపి కార్యాలయంలో మండల కన్వీనర్‌ మద్దిబోయిన వీరరఘు ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్ట్‌ ప్రభావతిని బోగోలు మండల సీనియర్‌ నాయకులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వైసిపి కన్వీనర్‌ మద్దిబోయిన వీరరఘు అంతర్జాతీయ మహిళా దినోత్సవ చారిత్రక ప్రాముఖ్యాన్ని వివరించారు. శ్రామిక మహిళా హక్కుల పోరాటదినం స్ఫూర్తిగా నేటికీ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న స్త్రీ, పురుష జనాభా నిష్పత్తిలో స్రీల శాతం చాలా తక్కువగా ఉండటానికి ప్రస్తుత పరిస్థితిలే కారణమని, మహిళల సాధికారత, స్వావలంభనల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడిందని, పోరాడితే పోయేది బానిస సంకెళ్లే అని అన్నారు. కుల, మతాలకు అతీతంగా మహిళలు సంఘటితం కావాల్సిన అవసరాన్ని స్ఫూర్తినిచ్చేలా చెపుతూ నిర్భయ, ఆయేషా మీరా, ఆసిఫాబానో, కావలిలో తస్లీమా బానో ఉదంతాలను తెల్పారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు మేకల శీను, ఎకె సుందర్‌ రాజ్‌, తోటపల్లి సాగర్‌, పాపయ్య, నాయబ్‌ రసూల్‌, బొంత సుధీర్‌, వైసిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

➡️