మహిళా సాధికారతే ధ్యేయం : కలెక్టర్‌

ప్రజాశక్తి – కడప మహిళాభివద్దికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంభన దిశగా ముందుకు సాగుతోందని కలెక్టర్‌ వి.విజరు రామరాజు పేర్కొన్నారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో జిల్లాలో 11 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం మంజూరు చేసిన మహిళాశక్తి ఆటో లను సెర్ఫ్‌ పథకం ద్వారా కలెక్టర్‌ లబ్ధిదారులకు అందజేశారు. అనం తరం ఉచిత డ్రైవింగ్‌ శిక్షణా లైసెన్స్‌ పత్రాలను లబ్ధిదారులకు అందజేసి మంజూరైన ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉన్నతి – మహిళాశక్తి పథకం కింద ఎస్‌సి, ఎస్‌టి పేద మహిళలకు 2023- 24 ఆర్థిక సంవత్సరానికి సంబ ంధించి జిల్లాలో 11 మంది మహిళలకు వడ్డీ లేని రుణాల ద్వారా మం జూరైన ఆటోలు అందజేశామన్నారు. ఈ పథకం ద్వారా 10 శాతం లబ్ధి దారు వాటా చెల్లించగా. మిగిలిన 90 శాతం వడ్డీ లేని రుణాన్ని ప్రభుత్వం బ్యాంకుల సహకారంతో అందిస్తోందన్నారు. ఈ రుణాన్ని 48 కంతులలో తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివద్ధి, మహిళా సంక్షేమం కోసం పాటు పడుతో ందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను మహిళలు అర్హులందరూ సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ ఎపిడి ప్రసాద్‌, కమ్యూనిటీ కో- ఆర్డినేటర్లు, ఏరియా కో-ఆర్డినేటర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

➡️