మహిళా సాధికారతే లక్ష్యం : ఎంపిపి

ప్రజాశక్తి – గరుగుబిల్లి : మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం మహిళా శక్తి పథకం కింద ఆటోలు మంజూరు చేసిందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపిపి ఉరిటి రామారావు అన్నారు. మండలంలోని శివ్వాం, వల్లరిగుడబకు చెందిన మహిళలకు మహిళాశక్తి పథకం కింద ప్రభుత్వం మంజూరు చేసిన ఆటోలను సోమవారం స్థానిక ఐకెపి కార్యాలయం వద్ద ప్రా రంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంపిపి మాట్లాడుతూ అర్హులైన ఎస్సీ, ఎస్టీ మహిళలకు కేవలం 10 శాతం వ్యయంతో వారు ఆటోలు సమకూర్చు కుని వాటి ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందేలా మహిళా శక్తి పథకం ద్వారా 90 శాతం రుణ సౌకర్యంతో ప్రభు త్వం మంజూరు చేసిందన్నారు. ఇందుకోసం సెర్ప్‌ పరిధిలోని ”ఉన్నతి” కార్యక్రమంలో వడ్డీ లేని రుణాలను మంజూరు చేసిందన్నారు. ఈ”మహిళా శక్తి” ద్వారా స్వశక్తితో ఎదిగే మహిళల కోసం మహిళా సంఘాల సభ్యుల్లో డ్రైవింగ్‌లో నైపుణ్యం ఉండి ఆటోలు కొనుగోలు చేసుకొని స్వశక్తితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. సర్పంచ్‌ కలిశెట్టి ఇందుమతి మాట్లాడుతూ మహిళలు మరింత ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ప్రభుత్వం పలు పథకాలు అందజేస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ జి.పైడితల్లి, ఎంపిటిసి సభ్యులు దేవాతి నారాయణమ్మ, ఎపిఎం పి.అప్పలనాయుడు, వైసిపి నాయకులు, సిసిలు పాల్గొన్నారు..

➡️