మాట తప్పిన సిఎం జగన్‌

Dec 31,2023 20:57
నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలు

నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలు
మాట తప్పిన సిఎం జగన్‌
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరుసిఎం జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన మాట తప్పడంపై దున్నపోతుకు అర్జీ ఇచ్చి అంగన్‌వాడీలు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో డిమాండ్లసాధన కోరుతూ జరుగుతున్న 20వ రోజు సమ్మెలో బాగంగా ఆదివారం నరుకూరులో అంగన్‌వాడీలు దున్నపోతుకు అర్జీ అందజేసి నిరసన తెలిపారు. అంగన్‌శాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి రెహనాబేగం మాట్లాడుతూ సిఎం జగ న్మోహన్‌ రెడ్డి ఎన్నికల ప్రచార పాదయాత్రలో అంగన్‌వాడీ కార్యకర్తలకు వేతనం పెంచుతానని మాట ఇచ్చారనాన్రు. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లయినా ఇప్పటి వరకూ ఆ హామీని అమలు చేయలేదన్నారు. అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను ఆమలు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిఐటియు నాయకులు మారుబోయిన రాజా, భోజన కార్మికులు తదితరులు పాల్గొ న్నారు.

➡️