మాయమాటల నమ్మి మోసపోవద్దు : ఎమ్మెల్యే

Mar 11,2024 21:31

ప్రజాశక్తి – బలిజిపేట : రాబోయే ఎన్నికల్లో ఓటు కోసం టిడిపి నాయకులు చెప్పే మాయ మాటలు నమ్మి మోసపోకుండా, ప్రజలకు అండగా ఉండే వైసిపిని ఆదరించాలని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. స్థానిక జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సోమవారం వైఎస్‌ఆర్‌ చేయూత పథకం చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి, శ్రేయస్సు కోసం పనిచేసే ప్రభుత్వం వైసిపి అని అన్నారు. ప్రతిపక్షాల మాయమాటలకు ప్రజలు మోసపోకూడదని, వారిచ్చే హామీలు వైసిపి ఒక్క పథకంతో కూడా సరితూగవని ఆయన చెప్పారు. కార్యక్రమంలో మండల వైసిపి అధ్యక్షులు పాలవలస మురళి, ఎంపిపి గుడివాడ నాగమణి, జెడ్‌పిటిసి సభ్యులు అలజంగి రవికుమార్‌, వైస్‌ ఎంపిపి వి.సాయిరాం, పలువురు అధికారులు, సర్పంచులు, ఎంపిటిసిసభ్యులు పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సమావేశాలు స్థానిక జిల్లా పరిషత్‌ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు అన్నారు. ఒకవైపు పాఠశాల తరగతులు జరుగుతుంటే మరోవైపు పెద్దపెద్ద శబ్దాలతో సుమారు 5వేల మంది జనాభాతో పాఠశాలలో సమావేశాలు నిర్వహించడం సరైన పద్ధతి కాదన్నారు. పిల్లలు చదువుకు ఒక భయంకర వాతావరణ సృష్టించి వారి తరగతుల నిర్వహణకు ఆటంకం కలిగేలా పాలకులు, అధికారులు వ్యవహరించారని విమర్శించారు. అలాగే సమావేశానికి వచ్చిన మహిళలు ఎండ తీవ్రత తట్టుకోలేక బయటకు వెళ్లిపోతుంటే సీసీలు అడ్డుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. మహిళలకు ఇష్టం ఉన్నా లేకున్నా వారికి డబ్బులు ఇస్తామన్న సాకుతో సభలకు రప్పించడం, వారిని బలవంతంగా ఉంచడం సరైన పద్ధతి కాదన్నారు. నిబంధనలను పాటించాల్సిన పాలకులు పాఠశాలలో తరగతులు జరుగుతున్న సమయంలో ఇలా సభలు నిర్వహిఒంచడం ఎంత వరకు సమంజసమని సర్వత్రా చర్చ జరుగుతోంది. పాలకొండ : ప్రభుత్వం ప్రకటించిన వైఎస్సార్‌ చేయూత ద్వారా నగరపంచాయితీ పరిధిలోని 1864 మంది లబ్ధిదారులకు నాలుగు విడతలుగా రూ.13కోట 14లక్షల, 37500 లబ్ధిదారుల అకౌంట్లను జమ చేసినట్టు స్థానిక ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. సోమవారం స్థానిక నగరపంచాయతీ కార్యాలయ ఆవరణలో విప్‌ విక్రాంత్‌, ఎమ్మెల్యే కళావతి చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో చైర్మన్‌ యందవ రాధాకుమారి, వైస్‌ ఛైర్మన్లు రౌతు హనుమంతరావు, పల్లా ప్రతాప్‌ మరియు కౌన్సిలర్లు ఉన్నారు.

➡️