‘మాలకొండ’ ఇఒకు ఉద్యోగోన్నతి

Feb 10,2024 19:29
డిప్యూటీ కమిషనర్‌ కెబి శ్రీనివాసరావును సన్మానిస్తున్న జెడ్‌పిటిసి

డిప్యూటీ కమిషనర్‌ కెబి శ్రీనివాసరావును సన్మానిస్తున్న జెడ్‌పిటిసి
‘మాలకొండ’ ఇఒకు ఉద్యోగోన్నతి
ప్రజాశక్తి – వలేటివారిపాలెంమాల్యాద్రి లకీë నృసింహాస్వామి దేవస్థానం మాలకొండ ఇఒగా పనిచేస్తున్న కెబి శ్రీనివాసరావు డిప్యూటీ కమిషనర్‌గా పదోన్నతి పొందారు. దీంతో శనివారం మాలకొండలో పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు. గత నాలుగేళ్ల నుంచి మాలకొండ ఇఒగా పనిచేస్తున్న శ్రీనివాసరావు మాలకొండ అభివద్ధిలో తనదైన ముద్ర వేసి భక్తుల అభిమానాన్ని పొందారు. డిప్యూటీ కమిషనర్‌గా పదోన్నతి రావడంతో జెడ్‌పిటిసి దంపతులు ఇంటూరి భారతి ఇంటూరి హరిబాబు మాలకొండలో శ్రీనివాసరావును సన్మానించారు. వైసిపి మండల కన్వీనర్‌ పరిటాల వీరస్వామి, జెసిఎస్‌ కన్వీనర్‌ అనుములు వెంకటేశ్వర్లు, వెంకట స్వామి మరి కొంతమంది ఆయనకు అభినందనలు తెలిపారు. అన్నదానంలో సేవ చేస్తున్న సేవకులు, అర్చకులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మాలకొండ లక్ష్మి నరసింహస్వామి ఆశీస్సులతోనే తనకు డిప్యూటీ కమిషనర్‌ గా పదోన్నతి వచ్చిందన్నారు. ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేసినట్లు తెలిపారు.

➡️