మా గోడు పట్టదా..?

అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె రోజురోజుకూ ఉధృతం అవుతోంది. రోజుకో విన్నూత రీతిలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తమ నిరసన నిర్వహిస్తున్నారు. మంగళవారం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వంటావార్పుతో నిరసన తెలియజేసి అక్కడ భోజనాలు చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఇచ్చే వేతనాలు చాలడం లేదని, పెంచమంటే మొండిగా వ్యవహరిస్తున్నారని, మీరైనా సాయం చేయాలని దుకాణాల వద్దకు వెళ్లి భిక్షాట చేసి తన నిరసన తెలియజేశారు. ఇంకొన్ని ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించి పట్టణాల్లోని నాలుగు రోడ్ల కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. ఇంత ఉధృతంగా ఆందోళన చేస్తుంటే తమ గోడు ప్రభుత్వానికి పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ ఆందోళనకు టిడిపి, జనసేన, కాంగ్రెస్‌, వామపక్షాలు, ప్రజాసంఘాల నాయకులు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించి ఆందోళనలో భాగస్వామ్యులయ్యారు. మైదుకూరు : మైదుకూరు సిడిపిఓ కార్యాలయం ఎదుట సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌ టియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తల సమ్మెలో భాగంగా మంగళవారం వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలు శిబిరం వద్దే భోజనాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లా డుతూ ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం రూ.26 వేలు, ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ రద్దు, ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు సుధాకర్‌, షరీఫ్‌, బాలరాజు, రవి, రాజా, జహంగీర్‌ భాష, సిఐటియు, ఎఐటియుసి, భారతి, ధనలక్ష్మి, గంగావతి, చెన్నమ్మ, శోభ పాల్గొన్నారు. వేంపల్లె : సమ్మెలో భాగంగా అంగన్వాడీలు పట్టణంలో బిక్షాటన చేశారు. 8 రోజుల నుంచి అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం అంగన్వాడీ మహిళాలు అందరూ ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. కూడలిలో మానవహారం చేసి నిరసన వ్యక్తం చేశారు. దుకాణాల వద్దకు వెళ్లి ప్రభుత్వం జీతాలు పెంచలేదని, కాబట్టి భిక్షం వేయాలని అంగన్వాడీలు బిక్షాటన చేశారు. ఈ సందర్భంగా సిఐటియు, ఎఐటియుసి నాయకురాలు లలితా దేవి, సరస్వతి, శైలజాలు మాట్లాడుతూ 8 రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడం సిగ్గుచేటన్నారు. అరకొర జీతాలతో కుటుం బాలను పోషించుకోలేక అవస్థలు పడుతున్నామని వాపో యారు. పాదయాత్రలో జగన్‌ రెడ్డి ఇచ్చిన హమీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సిఎం జగనన్న అంగన్వాడీ మహిళాల పట్ల కనికరం చూపి జీతాలు పెంచడంతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిం చాలని కోరారు. కార్యక్రమంలో వేంపల్లె, వేముల, చక్రాయపేట మండలాలలోని అంగ న్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. చాపాడు : ఎనిమిది రోజు లుగా తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని అంగ న్వాడీ కార్యకర్తలు చేపడుతున్న నిరసనలకు మంగళవారం బాలింత తల్లులు, అంగన్వాడీ పిల్లల తల్లులు మద్దతు తెలిపారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద చేపడుతున్న నిరసన దీక్షలో తల్లులు పాల్గొని తమ పిల్లల ఆలన, పాలనా చూసే అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి సుబ్బ రాయుడు దీక్షలకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తల నాయకులు సుజాత, అరుణ, మహాలక్ష్మి , కార్యకర్తలు పాల్గొన్నారు. పులివెందుల టౌన్‌ : ప్రభుత్వమిచ్చిన హామీలు అమలు, గ్రాట్యుటీ, సంక్షేమ పథకాల వర్తింపు తదితర డిమాండ్లతో అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణంలో అంగన్‌వాడీలు పెద్దసంఖ్యలో సమ్మె శిబిరానికి తరలి వచ్చి వంటావార్పు కార్యక్రమంతో వినూత్నంగా నిరసన తెలిపారు. తమ డిమాండ్ల అంగీ కరించే వరకు సమ్మె విరమించిమన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు , ఆయాలు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌) : సిఐటియు, ఎఐటియుసి, అర్బన్‌ సెంటర్లో ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాల యం ఎదుట అంగన్వాడీల సమ్మె ఎనిమిదవ రోజు చేరు కుంది. ఈ సందర్భంగా అంగనవాడి కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా అంగన్వాడీ జిల్లా కార్యదర్శి లక్ష్మీదేవి మాట్లాడుతూ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా మొండి వైఖరి అనుసరించడం మంచి పద్ధతి కాదని, ఎన్నికల ముందు అధికారం కోసం అనేక రకాల అబ ద్ధాలు చెప్పి అంగన్వాడీ వర్కర్లను మోసం చేశారని చెప్పారు. కార్యక్ర మంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, సిఐటియు కార్యదర్శి విజరు కుమార్‌, ఎఐటియుసి నాయ కులు విజయమ్మ, ఎఐటిసి రాష్ట్ర నాయ కులు మంజుల, అంగన్వాడీలకు మద్దతుగా ఐద్వా జిల్లా ప్రధాన కార్య దర్శి ముంతాజ్‌ బేగం, ప్రొద్దుటూరు మహిళా సంఘం కార్యదర్శి వెంకటసుబ్బమ్మ, రాములమ్మ, లక్ష్మీదేవి, ప్రగతిశీల కార్మిక సంఘం నాయకులు శీను, హరిత, నాగేంద్ర, యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి రవీంద్రుడు, ఎస్‌టియు నాయకులు రషీద్‌ ఖాన్‌, టీచరు గంగరాజు ఉపాధ్యాయ సంఘం నాయకుడు వంటేరు శ్రీనివాసులరెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ డేవిడ్రాజు, కార్మిక సంఘ నాయకుడు ఏసేపు, టిడిపి నాయకులు హరిత మౌనిక మద్దతు తెలిపారు. అంగన్వాడీ కార్యదర్శి సుబ్బలక్ష్మి, నాగలక్ష్మి, రాజి,నిర్మల,సునీత,పద్మ,సుబ్బలక్షు మ్మ యూనియన్‌ కార్యదర్శి సాల్మన్‌ అంగన్వాడీ వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోరుమామిళ్ల : అంగన్వాడీ సెంటర్ల బీగాలు పగలగొట్టడం ప్రభుత్వానికి సిగ్గుచేటని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌ పేర్కొన్నారు. పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం ముందు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు యన్‌ భైరవ ప్రసాద్‌ అధ్యక్షతన అంగన్వాడివర్కర్లు ,హెల్పర్లు మినీ అంగన్వాడీ వర్కర్లు సమ్మె ఎనిమిదవ రోజు వంటావార్పు కార్యక్రమంతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మనోహర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపిప్రభుత్వం దు ర్మార్గంగా పాలిస్తుందని చెప్పారు. ఎనిమిది రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు సెంటర్లు మూసేసి రోడ్డుపైకి వచ్చి జీతాలు కోసం సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని వాపో యారు. అంగన్వాడీలు జీతాలు పెంచమని అడిగితే ఏమాత్రం పెంచకుండా దోబూ చులాడుతూ వెనక్కి పంపడం సబబు కాదన్నారు. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ వర్కర్లని చర్చలు పిలిపించి వారి న్యాయమైన కోరికలను తీర్చాలన్నారు కార్యక్ర మంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యురాలు ఓబులాపురం విజయమ్మ, అంగన్వాడీ ప్రాజెక్టు కార్యదర్శి మేరీ, వినోదా, దస్తగిరిమ్మ, రేణుక, విజయమ్మ, జ్యోతిమ్మ, రమాదేవి, శ్రీదేవి, లక్ష్మీదేవి, 200మంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ అంగన్వాడీ వర్కర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. కడప అర్బన్‌ : అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైన పోరాటానికి అండగా నిలబడతామని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు ఆలం ఖాన్‌ పల్లె లక్ష్మీ రెడ్డి, జనసేన జిల్లా ఇన్‌ఛార్జి సుంకర శ్రీనివాసులు, టిడిపి కార్పొరేటర్‌ ఉమాదేవి అన్నారు. మంగళవారం నగరంలో అంగన్వాడీలు 8 రోజులుగా చేస్తున్న శాంతియుత నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి నెరవేర్చకపోవడం దుర్మార్గమన్నారు. ప్రస్తుతం అంగన్వాడీలు, ఆశా వర్కర్లు రోడ్‌ ఎక్కారని, త్వరలో మున్సిపల్‌ కార్మికులు కూడా రోడ్డు ఎక్కనున్నట్లు పేర్కొన్నారు. అంగన్వాడీలు, ఆశ వర్కర్లు చేస్తున్న దీక్షలకు ప్రభుత్వం దిగి రాకపోతే రాబోయే రోజుల్లో మరెన్నో ఉద్యమాలు వస్తాయని చెప్పారు. ప్రజల తరపున నిలబడి వారికి సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం చేస్తామని తెలిపారు ముఖ్యమంత్రి ఇప్పటికైనా అంగన్వాడీ, ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పాలకొండ మాజీ చైర్మన్‌ ఓబుల్‌ రెడ్డి, పత్తి విశ్వనాథ్‌, అంగన్వాడి, ఆశ వర్కర్లు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.

➡️