‘మిట్స్‌’ను సందర్శించిన ఎన్‌సిసి

కమాండర్‌ప్రజాశక్తి-మదనపల్లి మిట్స్‌ కళాశాలను తిరుపతి ఎన్‌సిసి గ్రూప్‌ హెడ్‌ క్వార్టర్స్‌ ఎన్‌సిసి గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ వై.డుంగ్రకోటి సందర్శించారని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ యువరాజ్‌ తెలిపారు. ఎన్‌సిసిి క్యాడెట్స్‌ను ఉద్దేశించి వై.డుంగ్రకోటి మాట్లాడుతూ ఎన్‌సిసి ఉద్దేశ్యం విద్యార్థులను పాఠశాల దశ నుంచే సైన్యంలో చేరేలా ప్రోత్సహించమన్నారు. యువతలో సైన్యం పట్ల అవగాహన కల్పించేందుకు, సైనిక స్థాయిలో వారిని సిద్ధం చేసేందుకు ఇది ఏర్పడిందని పేర్కొన్నారు. ఎన్‌సిసి శిక్షణ ద్వారా విద్యార్థులలో ధైర్యసాహసాలు, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, లౌకిక దక్పథం, సాహసం, క్రీడాస్ఫూర్తి, నిస్వార్థ సేవా భావాలు పెంపొందించబడతాయని పేర్కొన్నారు. శిక్షణ సమయంలో విద్యార్ధులకు డ్రిల్‌, షూటింగ్‌, ఫిజికల్‌ ఫిట్నెస్‌, మ్యాప్‌ రీడింగ్‌, ఫస్ట్‌ ఎయిడ్‌, గ్లైడింగ్‌, బోట్‌ పుల్లింగ్‌, సెయి లింగ్‌తో పాటు క్యాంప్‌ ట్రైనింగ్‌లో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ అవసరాలకు తగ్గట్లు ప్రాథమిక సైనిక శిక్షణ ఇస్తారని తెలిపారు. వీటిపై విద్యార్థులకు అవగహన పెంచి, విద్యార్థులలో యెన్‌.సి.సి పై చైతన్యం నింపి ప్రోత్స హించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి తగ్గట్టుగా ఎన్‌సిసి ి క్యాడెట్స్‌కు ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌, డ్రోన్‌ టెక్నాలజీ, డేటా సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ రంగాలల్లో, దేశ రక్షణకు కావలిసిన పరిశోదనలు చేసే వీలు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇంటెర్షిప్‌ రూపంలో ఇస్రో, డిఆర్‌డిఒ లాంటి సంస్థలో అవకాశాలు కూడా ఇస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. బి.టెక్‌ చదువుతున్న ఎన్‌సిసి క్యాడెట్స్‌కు ఎస్‌ఎస్‌బి, ఎన్‌సిసిి స్పెషల్‌ ఎంట్రీ స్కీం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. మిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఎన్‌సిసి క్యాడెట్స్‌ సాధించిన విజయాలకు ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. కార్యక్రమంలో ఎన్‌సిసి కల్నల్‌ అజరు బాస్నెట్‌, ఆఫీసర్‌ కమాండెంట్‌, మేజర్‌ టి.లోగనాథన్‌ ఆడమ్‌ ఆఫీసర్‌, 35 ఆంధ్ర బెటాలియన్‌, చిత్తూర్‌, లెఫ్ట్‌ నెంట్‌ కల్నల్‌ సంజరు, తిరుపతి గ్రూప్‌, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సి.యువరాజ్‌, లెఫ్ట్‌ నెంట్‌ డాక్టర్‌ నవీన్‌ కుమార్‌, ఎన్‌సిసి విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

➡️